వారిని కూడా అలానే శిక్షించాలి అని కోరుతున్న ప్రజలు  

people demands Same punishment should give to unnao - Telugu Hyderabad Shadh Nagar Chatan Pally, People, , Uttar Pradesh Unnavu, Vetornary Doctor Priyanka Reddy

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్య కేసులో నిందితులకు త్వరగా శిక్ష పడింది అని వారి ఎంకౌంటర్ పై స్పందించిన ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ లోని షాద్ నగర్ లోని చటాన్ పల్లి లో అత్యంత పాశవికంగా వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం చేసి ఆ తరువాత అంతమొందించిన ఘటన ప్రజల్లో ఆగ్రహజ్వాలలను రేపిన సంగతి తెలిసిందే.

People Demands Same Punishment Should Give To Unnao

అయితే ఈ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో కూడా నిన్న ఒక ఘటన చోటుచేసుకుంది.యువతి పై ఈ ఏడాది మార్చి లో అత్యాచారం చేసిన నిందితుడు ని పోలీసులు అరెస్ట్ చేయగా, ఇటీవల బెయిల్ పై తిరిగి బయటకు వచ్చాడు.

ఈ క్రమంలో ఆ అత్యాచార బాధితురాలి పై పగ బట్టిన నిందితుడు కాపు గాసి కిరోసిన్ పోసి ఆ యువతిని తగులబెట్టాడు.

దీనితో ఆ యువతి దాదాపు 90 శాతం పైగా కాలిపోవడం తో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే దిశ ఘటనలో నిందితులకు ఎలాంటి శిక్ష అయితే పడిందో అలాంటి శిక్షే ఆ ఉన్నావ్ నిందితులకు కూడా పడాలి అంటూ పలువురు యూపీ ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

#People

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

People Demands Same Punishment Should Give To Unnao Related Telugu News,Photos/Pics,Images..