పెళ్లి కోసం వచ్చి కొట్టుకున్న బంధువులు.. షాక్ అయిన ఆలయ సిబ్బంది!

పెళ్లి అంటేనే ఎన్నో సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి.ఎవరి ఆర్ధిక స్తోమతను బట్టి వారు ఉన్నంతలో పెళ్లిని ఘనంగా చేయాలనీ అనుకుంటారు.

 People Came To The Wedding And Smashed Into The Temple Together, Marriage Fight,-TeluguStop.com

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని అద్బుతమైన ఘట్టం.ఇది ఇద్దరి మనుషులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను కూడా ఒకటి చేస్తుంది.

పెళ్లి కోసం కొంతమంది చాలా ఖర్చు చేసి అంగరంగ వైభవంగా చేసుకుంటారు.

మరికొంత మంది మాత్రం సింపుల్ గా చేసుకోవడానికి ఇష్ట పడుతారు.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండు వారు కూడా పెళ్లిని సింపుల్ గా ఆలయంలో చేసుకోవాలని అనుకున్నారు.అలానే పెళ్లి చేసుకోవడానికి ఆలయానికి వచ్చారు.కానీ అనూహ్యంగా అక్కడ ఇద్దరి మధ్య గొడవ వచ్చి మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లారు.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటన తమిళనాడులో జరిగింది.అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఉన్న ఆలయ సిబ్బందికి కూడా చెమటలు పట్టేలా చేసారు ఈ రెండు జంటల బంధువులు.పెళ్ళికి వచ్చిన బంధువులు మధ్య వాగ్వివాదం చెలరేగి కొట్టుకునే వరకు వెళ్లారు.వీళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్య పోవడం ఖాయం.

ఇంతకీ ఏం జరిగిందంటే.

ఆ ఆలయంలో శ్రావణ మాసం కారణంగా పెళ్లి చేసుకునేందుకు చాలా జంటలు వచ్చాయి.ఒక్కో వివాహం జరగడానికి కేవలం అరగంట మాత్రమే సమయం.ఆ అరగంటలో పెళ్లి చేసుకోవడం పూర్తి అవ్వాలి.

అయితే చాలా జంటలు రావడంతో ముహూర్త సమయాలు ఆలస్యం అయ్యాయి.దీంతో ఇద్దరి జంటల బంధువుల మధ్య గొడవ జరిగింది మా పెళ్లి ముందు జరగాలంటే మా పెళ్లి ముందు జరగాలని బంధువులంతా కొట్టుకున్నారు.

ఆలయ సిబ్బంది ఎంత చెప్పిన వినిపించుకోకుండా గొడవ పడుతూనే ఉన్నారు.చివరికి ఆ గొడవ పెరగడంతో కొట్టుకునే వరకు వెళ్లారు.ఇలా ఆలయంలో కొట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.నిబంధనలు పాటించకుండా కొట్టుకోవడం పై ఆలయ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/Shilpa1308/status/1428687742104264706

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube