మీరు 9 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

9 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.9 వ సంఖ్యకు అధిపతి కుజుడు.కాబట్టి వీరి మీద కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.వీరు మంచి ఆలోచన శక్తితో వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు.వీరు ఏ పని చేసిన సాహసవంతంగా ఉండాలని కోరుకుంటారు.వీరు చేసే పనులు రిస్క్ కలిగి ఉండుట వలన కొన్ని విజయాలు కొన్ని పరాజయాలు కూడా ఉంటాయి.

 People Born On The 9 Th Of Every Month-TeluguStop.com

కాబట్టి వీరు కాస్త అలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి.

వీరికి జీవితంలో హెచ్చుతగ్గులు తరచుగా ఉంటూ ఉంటాయి.వీరికి కోపం వస్తే ఆపటం ఎవరి వల్ల కాదు.అంతలా వారికీ విపరీతమైన కోపం వస్తుంది.

అందువల్ల ఆవేశం,కోపం రాకుండా చూసుకుంటే మంచిది.వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ.

వీరు గొడవలకు వెళ్ళరు.కానీ ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం గొడవలకు వెళతారు.

వీరు ఏ రంగంలో ఉన్నా సరే పది మందిని కంట్రోల్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటారు.వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది.కొన్ని సందర్భాలలో ఈ మొండి పట్టుదల డబ్బును,కీర్తిని తీసుకువస్తాయి.అలాగే అదే మొండి పట్టుదల కారణముగా సర్వస్వము పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

వీరు ఆవేశం,కోపం వచ్చినప్పుడు తీసుకొనే నిర్ణయాలు ఎవరు ఊహించలేరు.

అలాగే వారికీ కూడా అర్ధం కానివిగానే ఉంటాయి.ఒక విధంగా చెప్పాలంటే వారు ఏమి చేస్తున్నారో వారికే అర్ధం కానీ స్థితిలో నిర్ణయాలు తీసుకుంటారు.

కాబట్టి అనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల ఆవేశం,కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI