మీరు 8 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?       2018-06-17   01:46:17  IST  Raghu V

8 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 8 వ సంఖ్యకు అధిపతి శని. అందువల్ల వీరు జీవితాంతం కస్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు కాస్త ఎక్కువగా కష్టపడితేనే విజయాలు వస్తాయి. వీరు ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే పనులను చేస్తూ ఉంటారు. అలాగే తన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా హేతుబద్దంగా ఆలోచనలు చేస్తారు. ఎవరైనా వీరిని పొగిడితే ఆ మాయలో పడకుండా కాస్త ఆలోచిస్తారు.

వీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఎప్పుడు పని,ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరు పది మందితో కలిసి మెలసి తిరగలేరు. వీరు ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు. వీరు అవసరం మేరకు మాత్రమే మాట్లాడతారు. ఎక్కువగా మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు.

వీరు జీవితంలో అనుకున్న ప్రతిదీ సాధిస్తారు. అయితే కాస్త ఆలస్యంగా సాధిస్తారు. వీరు ఏదైనా సాధించాలంటే కృషి,పట్టుదల ఆయుధాలుగా ఉండాలి. ఆలా ఉంటేనే ఏదైనా సాధించటం సాధ్యం. భగవంతుని మీద భక్తి ఉంటే చాలా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే అసలు ఉండదు. హేతుబద్దంగా ఉంటారు. వీరిలో త్యాగం ఎక్కువగా ఉంటుంది.

వీరు ఎవరి మాట వినరు. వారి ఆలోచనలకూ తగ్గట్టుగానే పనులను చేస్తూ ఉంటారు. దీనితో వీరికి కొన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి కాస్త వైన్ తత్వాన్ని అలవర్చుకోవాలి. వీరిని కొన్ని సందర్భాలలో చెడు వ్యసనాలు ఆకట్టుకుంటాయి. అందువల్ల సరదాగా కూడా వ్యసనాల వైపుకు వెళ్ళకూడదు. ఒకేవేళ వెళ్ళితే వ్యసనాల నుండి బయటకు రావటం కష్టమే.