14 వ తేదీన జన్మించారా....అయితే మీకు ఎంత అదృష్టం ఉందో తెలుసుకోండి.

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ తేదీన పుడితే ఎలాంటి లక్షణాలున్నాయో నిపుణులు చెబుతుంటారు.ఇక అది ఏ మాసమైనా, ఏ సంవత్సరమైనా సరే, 14వ తేదీన పుట్టి ఉంటే, అలాంటి వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఇప్పుడు తెల్సుకుందాం.

14వ తేదీ లో ఒకటికి సూర్యుడు, నాలుగుకి రాహువు అధిపతులు .ఇక ఈ రెండు కల్పి ఇక సంఖ్యగా చేస్తే వచ్చే 5కి అధిపతి బుధుడు.14వ తేదీన పుట్టిన వాళ్లపైన సూర్య, రాహు గ్రహాల కన్నా 70నుంచి 80శాతం బుధ గ్రహ ప్రభావం ఉంటుంది.14వ తేదీన పుట్టిన వాళ్ళు అదృష్టవంతులుగా నిపుణులు చెబుతున్నారు.వీళ్ళు ఏ పని చేపట్టినా, ఎక్కడ పెట్టుబడి పెట్టినా బాగా కల్సి వస్తుందట.

ఎక్కువగా ఆలోచన చేస్తూ, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి , ఈ సమస్యను ఎలా అధిగమించాలి, ఇలా ఏదోకటి ఆలోచిస్తూ అనుకున్నది సాధిస్తారు.తెలివి తేటలకు కారణమైన బుధ గ్రహ ప్రభావం అధికంగా వీరిపై ఉండడం వలన అన్నింటా నెగ్గుకొస్తారు.

ఒకవేళ జ్యోతిష్య శాస్త్రం జోడిస్తే, ఏదైనా గ్రహప్రభావం వలన కొంచెం తేడా ఉండొచ్చేమో గానీ, సంఖ్యా శాస్త్ర రీత్యా వీరు అన్నింటా రాణిస్తారు.తక్కువ చదువుకున్నా సరే, తక్కువ ఉద్యోగం చేస్తున్నా సరే , అనతికాలంలోనే శాసించే స్థాయికి చేరుతారు.నవ్వుతూ పనులు పూర్తిచేయగల నేర్పు ఓర్పు ఉంటాయి.

Advertisement

కాగా జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ప్రేమ లాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది.

ఎందుకంటే , వీళ్ళు ఎంత తెలివైన వారైనా సరే, ప్రేమ వ్యవహారం వీరికి అచ్చిరాదు.పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడం మంచిది.

Advertisement

తాజా వార్తలు