Bald Hair Transplant : బట్టతలపై జుట్టు కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతున్నారు

వంశపారంపర్యం కావొచ్చు.సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్లనో చాలా మంది యువకులకు బట్టతల వచ్చేస్తోంది.

 People Are Losing Their Lives Trying To Find Hair On Bald Places , Hair Transpla-TeluguStop.com

ఈ సమస్య నుంచి బయట పడడానికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకుంటున్నారు.హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చిన్న వయసులోనే జుట్టు కోల్పోయిన వారికే కాదు.

హెయిర్‌లైన్‌లను మార్చుకోవాలనుకునే వారికి లేదా ఆకర్షణీయమైన లుక్ పొందాలనుకునే వారికి కూడా సరికొత్త క్రేజ్.అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లు నిజంగా సురక్షితమైనవా లేదా అనే విషయం కోసం ఇటీవల ఎక్కువ మంది తెలుసుకుంటున్నారు.

ఢిల్లీకి చెందిన రషీద్ అనే యువకుడు ఇటీవల హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం యత్నించాడు.చికిత్స విఫలమై, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆసుపత్రిలో చనిపోయాడు.

ఇది ప్రాణాంతం కాదు.అయితే చికిత్సలో అవలంబించే కొన్ని నిర్లక్ష్యాలు, సరైన పద్ధతులు పాటించకపోవడంతోనే ఇలాంటి విషాధ ఘటనలు జరుగుతున్నాయి.

Telugu Bald, Delhi, Follicular, Transplant, Care, Fitness, Helath, Rashid-Latest

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక శస్త్రచికిత్స ప్రక్రియ.ఇది తల చుట్టూ ఉండే వెంట్రుకలను తీసుకుని, బట్టతల లేదా జుట్టు తక్కువ ఉన్న చోట నాటడం.కనురెప్పలు, కనుబొమ్మలలో మార్పిడి చేయడంలో కూడా ఈ ప్రక్రియ ఉపయోగించబడుతుంది.తాజా పద్ధతులు శాశ్వతమైనవి.అవి జుట్టు యొక్క ఫోలిక్యులర్ క్లస్టర్‌లను ఎంచుకుంటాయి.ఈ ప్రక్రియను ఫోలిక్యులర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (FUT) అని పిలుస్తారు.

ఇది రెండు విధాలుగా చేయవచ్చు.స్ట్రిప్ హార్వెస్టింగ్, ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ (FUE).

స్ట్రిప్ హార్వెస్టింగ్‌లో, మంచి వెంట్రుకలు పెరిగే స్కిన్ స్ట్రిప్స్‌ను బట్టతల ఉన్న ప్రదేశాలలో నాటుతారు.ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ హెయిర్ క్లస్టర్‌లలో వాటి మూలాలను మాన్యువల్‌గా తీసివేసి వెంట్రుకలు లేని ప్రదేశంలో నాటుతారు.

స్ట్రిప్ హార్వెస్టింగ్ అనేది ఈ రోజుల్లో సర్జన్లు ఎక్కువగా అవలంబిస్తున్నారు.ఇది దాత సైట్ వద్ద ఒక సన్నని మచ్చను వదిలివేస్తుంది.

రెండు వారాల్లో రికవరీకి హామీ ఇస్తారు.FUE ఒకే లేదా అనేక సిట్టింగ్‌లలో చేయవచ్చు.

ఇది మాన్యువల్, సమయం తీసుకునే ప్రక్రియ కానీ చాలా సహజమైన ఫలితాలను ఇస్తుంది.అయినప్పటికీ, ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కాదు.

డాక్టర్ మరియు రోగి ఇద్దరికీ సమయం పడుతుంది.అయితే రోబోటిక్స్ వాడకం ఈ ప్రక్రియలో సమయాన్ని తగ్గించింది.

చికిత్సలో సరైన విధానాలు పాటించకపోవడంతోనే ఎంతో సురక్షితమైన ఈ ప్రక్రియ పలువురికి ప్రాణాంతకంగా మారుతోంది.కొందరికి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో వారు క్రుంగిపోయి ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తున్నారు.

అయితే సరైన వైద్య విధానంలో మంచి వైద్యుడిని సంప్రదిస్తే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది సురక్షితంగా జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube