అక్కడ కరోనా వైరస్ ఎక్కించుకుంటే 3 లక్షల రూపాయలు.. ఎందుకిస్తారంటే...?  

People Are Being Paid 300000 Rupees Be Infected Corona Virus Find Cure - Telugu Corona Virus Find Cure, Infected With Coronavirus, London, Queen Mary Bioenterprises

చైనాలోని వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం చైనాలో తగ్గినప్పటికీ ఇతర దేశాల్లో మాత్రం వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తునే ఉంది.మన దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

 People Are Being Paid 300000 Rupees Be Infected Corona Virus Find Cure

ఇప్పటికే శాస్త్రవేత్తలు కరోనా ను పూర్తి స్థాయిలో తగ్గించటానికి పలు పరిశోధనలు చేస్తున్నారు.కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, థియేటర్లు బంద్ చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించుకుంటున్నాయి.

తాజాగా కరోనా వైరస్ కు త్వరగా మందు కనిపెట్టాలనే ఉద్దేశంతో లండన్ లోని కొంతమంది శాస్త్రవేత్తలు ఏకంగా మనుషులపైనే కరోనా వైరస్ ను ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.క్వీన్ మేరీ బయో ఎంటర్ ప్రైజెస్ ఇన్నోవేషన్ సెంటర్ కు చెందిన నిపుణులు ఏకంగా మనుషులపైనే పరిశోధనలు చేయడానికి సిద్ధమై ఒక ప్రకటన చేశారు.

అక్కడ కరోనా వైరస్ ఎక్కించుకుంటే 3 లక్షల రూపాయలు.. ఎందుకిస్తారంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

శాస్త్రవేత్తలు ఆరోగ్యవంతంగా ఉండే వారిపై కరోనా జాతికి చెందిన రెండు వైరస్ లను ప్రయోగించనున్నామని తెలిపారు.ఆసక్తి ఉన్నవారికి భారత కరెన్సీలో మూడు లక్షల రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

కొంతమంది వాలంటీర్లు స్వచ్చందంగా ముందుకు రాగా వారిని 24 బ్యాచులుగా విడగొట్టి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు.కెనడాలోని హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ నుండి అనుమతులు వచ్చిన వెంటనే శాస్త్రవేత్తలు ప్రయోగాలను మొదలుపెడతారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఇందులో పాల్గొనే వాలంటీర్లంతా శాస్త్రవేత్తల నిర్భంధంలో ఉండాలని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు