ఆన్లైన్ లో కొబ్బరి చిప్ప రేటు తెలిస్తే ... ఇదెక్కడి విడ్డూరం అంటారు !  

People Angry Of Amazon On Sale Of Expensive Coconut Shell -

ఇప్పుడు అంతా ఆన్లైన్ యుగం.ఏది కావాల్సిన ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేస్తూ ఇంటి ముందుకు వచ్చేలా చేసేసుకుంటున్నాం.

People Angry Of Amazon On Sale Of Expensive Coconut Shell

ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లో దొరకని వస్తువు అంటూ లేవు.మనం ఎప్పడూ చూడని సరికొత్త రకాలతో పాటు… మనకి ఎప్పుడూ… అందుబాటులో ఉండి మనం పనికిరాని వస్తువులుగా చూసే కొన్ని రకాల వస్తువులు కూడా ఇందులో ప్రత్యక్షం అవుతుంటాయి.

ముఖ్యంగా అమెజాన్.ఆన్లైన్ షాపింగ్ గురించి తెలుసు కదా .! ఈ సంస్థ ఇప్పడు వార్తల్లోకి ఎక్కింది.ఎందుకంటే…

ఈ సంస్థ ఓ కొబ్బరి చిప్ప అమ్మకానికి పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఇంతకీ ఆ కొబ్బరి చిప్ప ప్రత్యేకత ఎమన్నా ఉందా అంటే …అది సాధారణ కొబ్బరి చిప్పే.కొబ్బరికాయ సుమారు రూ.20 నుంచి రూ.30 వరకూ ఉంటుంది.కాయ నుంచి తీసిన ఖాళీ చిప్పలు అంతకంటే తక్కువకే లభ్యమవుతాయి.కానీ అమెజాన్‌లో మాత్రం కొబ్బరి చిప్ప ఖరీదు రూ.1,400 అని దర్శనమిస్తుంది.కనీసం దానికి ప్రత్యేక రంగులు, ఇతర హంగులేమీ అద్దలేదు.

దీని ఖరీదు చూసి ఆశ్చర్యపోయిన ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి ట్విటర్‌లో పంచుకున్నారు.దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్‌ చేశారు.

రెమా రాజేశ్వరి ట్వీట్‌పైనా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.దీంతో ప్రస్తుతం నాచురల్‌ కోకోనట్‌ షెల్‌ కప్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది.ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.ఈ చిప్ప అసలు ఖరీదు రూ.3 వేలట.55 శాతం ఆఫర్‌లో భాగంగా రూ.1,365కి లభిస్తోంది.ఇటీవలి కాలంలో కొబ్బరి చిప్పలతో చేసిన బౌల్స్‌ వాడడం ట్రెండ్‌గా మారింది.

కొబ్బరి చిప్పలకు పాలిష్‌ చేసి, అందమైన రంగులు అద్దటంతో చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.కానీ ఇవి ఒక్కొక్కటీ రూ.100లోపే ఉంటున్నాయి.మరి సాధారణ కొబ్బరి చిప్పను ఏకంగా రూ.1,365కు అమ్మడం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

People Angry Of Amazon On Sale Of Expensive Coconut Shell- Related....