జనసేనలో చేరిన సామాజికవేత్త పెంటపాటి

ఏపీలో మెజార్టీ స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ … ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో చేరికలపై దృష్టిపెట్టింది.ఆయా నియోజకవర్గాల్లో బలమైన … ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న తటస్థ వ్యక్తులను గుర్తించి మరీ వారికి జెండా కప్పుతున్నారు.

 Pentapati Pullarao Join To Janasena Party-TeluguStop.com

ఈ విధంగానే … సామజిక వేత్త … సీనియర్ జర్నలిస్టు పెంటపాటి పుల్లారావు జనసేన పార్టీలో చేరారు.ఈమేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసిన ఆయన పార్టీలో చేరిపోయారు.

ఆయనకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.

అమెరికాలో చదువుకున్న పుల్లారావు పోలవరం నిర్వాసితులకు చాలా పోరాటం చేశారని… పవన్ చెప్పుకొచ్చారు.అందుకే ఆయనకు జనసేనలో … పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించినట్టు పవన్ వెల్లడించారు.పుల్లారావు అనుభవం జనసేన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

రాజకీయాల్లో మార్పుకోసం పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటంలో తాను భాగస్వామిని ఈ సందర్భంగా పుల్లారావు వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube