అమెరికా : పెన్సిల్వేనియాలో గుండెలు పిండేసే ఘటన...!!

అగ్ర రాజ్యం అమెరికాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే ఇంట్లో ఉన్న 10 మంది కాలి బూడిదై పోయారు.

 7 Adults And 3 Children Found Dead After Pennsylvania House Fire, Pennsylvania,f-TeluguStop.com

ఈ ఘటన అక్కడ ఉన్న వారిని ఎంతో కలిచివేసింది.మంటలు ఎగసి పడుతున్న క్రమంలో చుట్టుపక్కల ఉన్న వారు అలెర్ట్ అయ్యి ఫైర్ సిబ్బందిని పిలువగా హుటాహుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ లోగా అక్కడ వరుసగా అపార్ట్మెంట్ లు ఉండగా ఏ అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది అనే విషయం తెలుసుకున్న ఫైర్ ఆఫీసర్ ఒక్క సారిగా కుప్ప కూలిపోయాడు.

మంటలు చెలరేగి కాలి బూడిదైన ఇల్లు తమ భందువులకు చెందినదని తెలుసుకున్న అతడు పెద్దగా అరుస్తూ పడిపోయాడు.

అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరిని కలిచివేసింది.పెన్సిల్వేనియా లోని నేస్కోపెక్ లో తెల్లవారు ఝామున జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపడేలా చేసింది.

స్పృహ నుంచీ తేరుకున్న ఫైర్ ఆఫీసర్ చెప్పిన వివరాలు తెలుసుకుని అక్కడి వారు కూడా ఆవేదన చెందారు.ఇంతకీ ఏం జరిగిందంటే

Telugu America, Pennsylvania, Tragedy-Telugu NRI

అపార్ట్మెంట్ లో ఆఖరి ఫ్లోర్ లో తన కుటుంబ సభ్యులు ఉంటున్నారని అయితే రెండు రోజుల క్రితమే తన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారని వారు కూడా ఇందులోనే ఉన్నారని చెప్పడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు.తన వారినే కాపాడుకోవడానికి వచ్చానా అంటూ అతడు రోదిస్తూ చెప్పడంతో ఆవేదనకు లోనయ్యారు.ఈ ఘటనలో తన కుమారుడు, కుమార్తె, వదిన, బావ, ఇలా పది మందికి పైగానే ఉన్నారని వారందరూ చనిపోయారని ఆవేదన చెందాడు.

ఇదే అపార్ట్మెంట్ లో వారు 13 కుక్కలు కూడా పెంచుకున్నారని అవి ఏమయ్యాయో తెలియడం లేదని చనిపోయిన వారిలో ఒకరు ఫైర్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నారని తెలిపారు.అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలేమయ్యింది తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube