శరణార్ధుల సంక్షోభంలో అమెరికా... నిత్యావసరాలు తీర్చలేని స్థితిలో అగ్రరాజ్యం

అగ్రరాజ్యం అమెరికాలో శరణార్థుల బాధలు వర్ణనాతీతం.బాహ్యా ప్రపంచం దృష్టికి పాలకులు రానివ్వడం లేదో.

లేక అధికారులు తొక్కిపెడుతున్నారో కానీ శరణార్థుల క్యాంపుల్లో బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న వారి బాధ అరణ్య రోదనే.ఇటువంటి పరిస్ధితుల్లో శరణార్ధుల దుస్థితిని చూసిన అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్ చలించిపోయారు.

శరణార్ధుల సంక్షోభంలో అమెరికా

శుక్రవారం టెక్సాస్‌ సమీపంలో ఉన్న ఒక శరణార్ధుల శిబిరాన్ని ఆయన పరిశీలించారు.ఈ క్రమంలో సుమారు 400 మంది పురుషుల నరకయాతనను ప్రత్యక్షంగా చూశారు.వారు విశ్రమించడానికి ఎటువంటి గదులు లేకపోగా.అక్కడి అధికారులు కట్టుకునేందుకు కనీసం బట్టలు, దుప్పటి, దిండ్లను సైతం అందించలేదు.స్నానం చేసి కూడా చాలా రోజులు అవుతుండటంతో వారి శరీరాల నుంచి దుర్వాసన రావడాన్ని పెన్స్ గమనించారు.

ఉపాధ్యక్షుడి పర్యటనకు సరిగ్గా నెల రోజుల కిందట కొందరు మీడియా ప్రతినిధులు అదే శరణార్ధుల శిబిరాన్ని సందర్శించారు.

పాత్రికేయులను చూసిన ఒక శరణార్ధి బిగ్గరగా అరిచి.తమను నలభై రోజుల నుంచి ఇక్కడ ఉంచారని… తమకు చాలా ఆకలిగా ఉందని, పళ్లు తోముకోవాలని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

వారి గొంతు తడారిపోతున్నప్పటికీ గుక్కెడు నీళ్లు తాగడానికి కూడా అక్కడి అధికారులు అనుమతి ఇవ్వడం లేదని మీడియా ప్రతినిధులు తెలిపారు.ఈ శిబిరాన్ని సందర్శించిన అనంతరం పెన్స్ మాట్లాడుతూ.

శరణార్ధుల కారణంగా అమెరికా ఎంతటి సంక్షోబాన్ని ఎదుర్కొంటోందో ప్రజలు చూస్తున్నారని తెలిపారు.

కాగా ఈ స్థితి డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

శరణార్ధుల గురించి మీడియా అతి చేస్తోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube