ఈ పెన్ డ్రైవ్ డేటా తెలుసుకోవడానికి పిసికి కనెక్ట్ చేయక్కర్లేదు..మరిన్ని వింత ఆవిష్కరణలు మీకోసం.!  

Pen Drive And Other Luxury Useful Electronic Items For You-

సాంకేతిక ప‌రిజ్ఞానం పెరిగాక మ‌నిషి జీవ‌న విధానం పూర్తిగా మారిపోయింది. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే అనేక సౌక‌ర్యాలు మ‌న‌కు ముంగిట్లోకి వస్తున్నాయి.మన పని సుల‌భ‌త‌రం అయిందని చెప్పొచ్చు. అది ఆఫీసుల్లో కావ‌చ్చు, ఇండ్ల‌లో కావ‌చ్చు, గ‌తంలో క‌న్నా అనేక రెట్లు మ‌న‌కు ప‌నిభారం త‌గ్గింది. అందుకు కార‌ణం కొత్త‌గా వ‌స్తున్న అనేక వ‌స్తువులే..

ఈ పెన్ డ్రైవ్ డేటా తెలుసుకోవడానికి పిసికి కనెక్ట్ చేయక్కర్లేదు..మరిన్ని వింత ఆవిష్కరణలు మీకోసం.!-Pen Drive And Other Luxury Useful Electronic Items For You

అలాంటి వాటి గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం.ఆ వస్తువులేంటి.

అవి మనకు ఎలా ఉపయోగపడ్తున్నాయి ఒక లుక్కేయండి.

· సాధారణంగా పెన్ డ్రైవ్‌ల‌లో ఎంత డేటా ఉందో తెలుసుకోవాలంటే దాన్ని పీసీకి క‌నెక్ట్ చేయాల్సిందే.

కానీ ఈ పెన్ డ్రైవ్‌ను చూశారా. దీన్ని పీసీకి క‌నెక్ట్ చేయాల్సిన ప‌నిలేదు. దానిపైనే స్టోరేజ్ వివ‌రాల‌ను తెలియ‌జేసే ఓ ఇండికేట‌ర్ ఉంది.

దీంతో మ‌న పని ఇంకా ఈజీ అవుతుంది.

· మ‌న‌లో కారం ఇష్టం పడేవాళ్లు కొందరు.ఇంకొందరు చప్పటి ఆహారపదార్దాలను ఇష్టపడతారు.

ఇద్దరికి ఇష్టం అయ్యేలా వండాలంటే రెండు రకాల పదార్దాలు చేయాలి.కాని ఏ కష్టం లేకుండా ఈ సాస్ వేస్కుంటే సరి…. దీంట్లో కారం లెవ‌ల్‌ను అడ్జ‌స్ట్ చేసుకోవ‌చ్చు..

అంటే. కారం తినాల‌కునే వారు సాస్ సీసాను తిప్పితే కారంకు సెట్ అవుతుంది.

అప్పుడు సాస్ కారంగా వ‌స్తుంది. అదే వ‌ద్ద‌నుకుంటే దాన్ని మ‌ళ్లీ త‌క్కువ కారం ఉండే లెవ‌ల్‌కు అడ్జ‌స్ట్ చేయాలి. అప్పుడు చ‌ప్ప‌గా ఉన్న సాస్ మ‌న‌కు ల‌భిస్తుంది.

· లిఫ్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం,బ‌ట‌న్ ఒత్త‌డం అది వ‌చ్చేదాకా వెయిట్ చేయడం.వెయిట్ చేసేది నిమిషాలే అయినా సరే టైం వేస్ట్ అనిపిస్తుంటుంది.ఆ టైం కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి ఏర్పాటుచేసిందే ఈ లిఫ్ట్ బటన్.మీరు రూంలోనుండి బయటకు రాగానే మీ రూం డోర్ దగ్గర ఈ బటన్ ఉంటుంది.దీన్ని ప్రెస్ చేసి లిఫ్ట్ దగ్గ్గరు వెళ్లే లోపు లిఫ్ట్ మ‌నం ఉన్న ఫ్లోర్‌కు వ‌చ్చేస్తుంది. దీంతో స‌మయం ఆదా అవుతుంది.

· టాయిలెట్ కి వెళ్లి,ఫ్లష్ ఆన్ చేయడం మర్చిపోతుంటారు కొందరు.మరికొందరు బద్దకంతో ,నిర్లక్ష్యంతో ఆన్ చేయరు.

అలాంటి వారికోసమే ఈ డోర్ .టాయిలెట్‌కు వెళ్లి నీళ్లు ఫ్ల‌ష్ చేయ‌క‌పోయినా డోర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన హ్యాండిల్‌ను ప‌ట్టుకోగానే దానికి ఉన్న బ‌ట‌న్ ఆటోమేటిక్‌గా టాయిలెట్‌ను ఫ్ల‌ష్ చేస్తుంది.

భలే ఐడియా కదా.

· సాధార‌ణంగా మ‌నం ఏదైనా బాటిల్‌ను ఓపెన్ చేస్తే దాన్ని ఎప్పుడు ఓపెన్ చేశామో తేదీ మ‌న‌కు గుర్తుకుండ‌దు. కానీ ఈ బాటిల్ అలా కాదు.

దానిపై ఎల‌క్ట్రానిక్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఆ బాటిల్‌ను ఓపెన్ చేసిన‌ప్పుడ‌ల్లా ఆ తేదీ, స‌మ‌యంల‌ను డిస్‌ప్లే సేవ్ చేసి మ‌న‌కు చూపిస్తుంది..

· ఇలాంటి ఇరుకుగా ఉన్న రోడ్ల‌లో బెంచీల‌ను ఏర్పాటు చేసేందుకు వీలు కాదు. అవి దారికి అడ్డంగా వ‌స్తాయి.

పైగా ఖర్చు కూడా. కనుక న‌దికి ఉండే ఫెన్సింగ్‌నే అక్క‌డ‌క్క‌డా బెంచీల్లా మ‌లిస్తే బాగుంటుంది క‌దా. అందుక‌నే వారు ఇలా ఆ ఫెన్సింగ్‌ను మార్చారు..

· మ‌నం వేసుకునే దుస్తులు భిన్న‌మైన కాంతుల్లో భిన్న‌మైన రంగుల్లో క‌నిపిస్తాయ‌ని తెలుసు క‌దా. క‌నుక ఉద‌యం, మధ్యాహ్నం, రాత్రి ఉండే కాంతుల‌కు అనుగుణంగా మ‌నం వేసుకునే దుస్తుల రంగు ఎలా ఉంటుందో ముందే అనుభ‌వించేలా ఓ షాపింగ్ దుకాణంలో ట్ర‌య‌ల్ రూంలో ఇలా భిన్న‌మైన కాంతులు ప‌డేలా మూడు ర‌కాల లైటింగ్ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేశారు. వాటి కింద నిల‌బ‌డి మ‌నం వేసుకున్న దుస్తులు మూడు స‌మ‌యాల్లో ఏయే రంగుల్లో క‌నిపిస్తాయో తెలుసుకుని మ‌రీ దుస్తుల‌ను కొనుగోలు చేయ‌వచ్చు. ఈ సౌకర్యం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది క‌దా.

· సాధార‌ణంగా మ‌న దేశంలో ఎక్క‌డైనా ట్రాఫిక్ సిగ్న‌ల్స్‌లో మ‌న వంతు వ‌చ్చే వ‌ర‌కు లేదా మ‌నకు గ్రీన్ లైట్ ఎంత సేపు ఉంటుందోన‌నే దానిపై మాత్రమే ఇంకా సెక‌న్ల పాటు వేచి ఉండాలో తెలిపేలా సిగ్న‌ల్స్ వ‌ద్ద సెక‌న్ల సంఖ్య‌ను తెలియ‌జేస్తారు. అయితే ఆ సిగ్న‌ల్స్‌లో ఆ లైట్‌ను చూడండి. అందులో ఏయే లైట్ ఎంత సేపు ఉంటుందో సెక‌న్ల‌లో తెలుపుతున్నారు. ఇలా చేస్తే చాలా మంది వాహ‌న‌దారుల‌కు చాలా సౌక‌ర్యంగా ఉంటుంది.

· ఫోన్ల‌కు, ఇత‌ర చార్జ‌బుల్ వ‌స్తువుల‌కు చార్జింగ్ చేసుకునే పోర్టులు ఉంటాయి. కానీ ఏకంగా బ్యాట‌రీల‌కే వాటిని చార్జింగ్ చేసేందుకు యూఎస్‌బీ పోర్టుల‌ను అమ‌ర్చారు. కావాలంటే చిత్రంలో వాటిని చూడ‌వ‌చ్చు. ఈ ఐడియాకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్ప‌వ‌చ్చు.

9 Attachments