రోషన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన పెళ్లిసందD శ్రీలీల?

రోషన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన పెళ్లిసందD శ్రీలీల?

పాతికేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పెళ్లి సందడి.కె.

 రోషన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన పెళ్లిసందd శ్రీలీల?-TeluguStop.com

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ కుటుంబ, ప్రేమకథా చిత్రంలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.అశ్వనీ దత్, అల్లు అరవింద్ కలిసి ఈ సినిమాను నిర్మించగా, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా అప్పట్లో మంచి ఆదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే.

 రోషన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన పెళ్లిసందD శ్రీలీల?-రోషన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన పెళ్లిసందD శ్రీలీల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే అదే పెళ్లి సందడి పేరుతో అదే కె.రాఘవేంద్ర రావు దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే అభిమానుల ముందుకు వచ్చి మరో సారి విజయాన్ని నమోదు చేసింది.ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాగా, కథా నాయికగా శ్రీ లీల వ్యవహరించారు.

ఈ మధ్యే ఈ సినిమా రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ ను కూడా తెచ్చుకొని మరోసారి గొప్ప విజయాన్ని సాధించినట్టు తెలుస్తోంది.

Telugu Pellisandadi, Roshan, Sreeleala, Tollywood-Movie

ఇదిలా ఉండగా, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటి శ్రీ లీల, రోషన్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.రోషన్ చూడడానికి చాలా అందంగా ఉంటాడని, ఇక ఆయన మంచితనం విషయానికొస్తే 10 కి 9 మార్కులు ఇవ్వొచ్చని కథానాయిక లీలా తెలిపారు.అంతే కాకుండా యాక్టింగ్ స్కిల్స్ కూడా రోషన్ కి చాలా బాగా ఉన్నాయని ఆమె మరోసారి హీరోకు పదికి పది మార్కులు ఇచ్చేశారు.

దాంతో పాటు రోషన్ అద్భుతంగా డాన్స్ చేస్తారని ఆమె వివరించారు.కానీ సోషల్ స్కిల్స్ విషయానికి వస్తే, రోషన్ దాంట్లో కొంచెం తక్కువ యాక్టివ్ అని ఆమె స్పష్టం చేశారు.

ఎందుకంటే అతనికి కొంచెం సిగ్గు అని ఆమె నవ్వుతూ చెప్పారు.ఎందుకంటే అతనికి ఎదుటి వారితో కలిసి పోవడానికి కాస్త టైం పడుతుందని శ్రీలీలా చెప్పుకొచ్చారు.

#Sreeleala #Roshan #Pellisandadi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube