దిల్ రాజు కంట్లో పడ్డ పెళ్లిసందడి హీరోయిన్..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల.ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.అందుకే ఆమెకు వరుస క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.ఆల్రెడీ మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకున్న శ్రీలీల లేటెస్ట్ గా మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.

 Pellisandadi Heroine Sreeleela Chance In Dil Raju Movie, Sreeleela , Pellisanda-TeluguStop.com

దిల్ రాజు నిర్మాతగా తన ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి హీరోగా ఒక సినిమా వస్తుందట.రౌడీ బోయ్స్ తర్వాత ఆశిష్ చేస్తున్న ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది.ఆశిష్ రెడ్డి, శ్రీలీల జంటగా చేస్తున్న సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా మిక్కి జే మేజర్ ను సెలెక్ట్ చేసినట్టు టాక్.

ఇక ఈ సినిమాకు డైరక్టర్ ఎవరన్నది మాత్రం నిర్ణయించలేదు.పెళ్లిసందడి రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీలకు మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు.దిల్ రాజు కంట్లో పడ్డది అంటే అమ్మడి దశ తిరిగినట్టే లెక్క. మరి శ్రీలీలకు రాబోతున్న సినిమాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube