శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లి సందడి విడుదల అయ్యి రెండు సంవత్సరాలు కాబోతుంది.అయినా ఇప్పటి వరకు రోషన్ యొక్క రెండవ సినిమా విడుదల కాలేదు.
కనీసం షూటింగ్ అప్డేట్ కానీ.సినిమా నుండి ఫస్టు లుక్ కానీ ఇవ్వలేదు.
అసలు రోషన్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంపై క్లారిటీ కానీ లేదు.దాంతో రోషన్ సినిమా అప్డేట్ పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రోషన్ రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.అందులో మొదటిది ప్రముఖ దర్శకుడు అశ్వినీదత్ నిర్మాణంలో ఒక సినిమా అనే విషయం తెల్సిందే.ఆ సినిమా గురించి ఆ మధ్య ప్రముఖంగా ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందా.కనీసం స్క్రిప్ట్ వర్క్ అయినా జరుగుతుందా లేదా అనేది తెలియడం లేదు.

రోషన్ హీరోగా బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటూ పేరు దక్కించుకున్న రోషన్ కు మంచి కథ పడితే టాలీవుడ్ స్టార్ హీరో అవ్వడం ఖాయం.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రోషన్ రాబోయే సినిమా లు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయట.
బ్లాక్ బస్టర్ ఏమో కానీ అసలు అప్ డేట్ ఇవ్వడం లేదు అంటూ శ్రీకాంత్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి సందడి హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీ లీల ఇప్పటికే రెండు మూడు సినిమా లు చేసింది.
కానీ రోషన్ మాత్రం ఇప్పటి వరకు తదుపరి సినిమా విడుదల అవ్వలేదు.ఈ ఏడాది లో అయినా సినిమా ఉంటుందా అనేది చూడాలి.
