త్వరలోనే రాబోతున్న 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్.. ముహూర్తం ఫిక్స్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మరెన్నో మరుపురాని చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసాడు.అయితే ఆయన మరపురాని చిత్రాలలో బాగా గుర్తుండి పోయే చిత్రాలలో పెళ్లి సందడి ఒకరి.

 త్వరలోనే రాబోతున్న ‘పెళ్లి �-TeluguStop.com

ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి పాటలు కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

Telugu Pelli Sandadi, Pellisandadi, Raghavendra Rao, Roshan Meka, Sreeleela-Movi

ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.ఎంత హిట్ అయ్యాయంటే ఇప్పటికి ఈ సాంగ్స్ అంటే ఇష్టపడని వారు ఉండరేమో.ప్రస్తుతం రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందD’ అనే సినిమాలో కొత్త తరం జంటతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుంటే తెలుగు అమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు కూడా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల అయ్యాయి.ఆ రెండు సాంగ్స్ సూపర్ హిట్ కూడా అయ్యాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక సాంగ్ రాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈసారి టైటిల్ సాంగ్ తో మన ముందుకు రాబోతుంది చిత్ర యూనిట్.

Telugu Pelli Sandadi, Pellisandadi, Raghavendra Rao, Roshan Meka, Sreeleela-Movi

ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు పోస్టర్ విడుదల చేసారు.రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమాగా ఉంది చిత్ర యూనిట్.ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఆర్కే ఫిలిం అసోసియట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube