మరొకసారి తన మార్క్ చూపించిన దర్శకేంద్రుడు..పెళ్లి పాట అదుర్స్ !

టాలీవుడ్ లో 100 కు పైగా సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మరెన్నో మరుపురాని చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసాడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.ఆయన మరపురాని చిత్రాలలో బాగా గుర్తుండి పోయే చిత్రం పెళ్లి సందడి.

 Pelli Sandadi Title Song Out Now, Pelli Sandadi, Roshan Meka, Sreeleela, Raghave-TeluguStop.com

ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అవ్వడమే కాకుండా ఇప్పటికీ పెళ్లిసందడి అంటే ఒక బ్రాండ్ ఉంది.

ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ ఈ సినిమా హిట్ తో స్టార్ హీరో అయ్యాడు.అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి మూల కారణం ఇందులోని పాటలు అని చెప్పవచ్చు.ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి ఈ పాటలు ఎంతో మందికి ఇష్టం.

అయితే ఈ సినిమా వచ్చిన ఇంత కాలం తర్వాత మళ్ళీ అదే పేరుతొ కొత్త తరం జంటతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుంటే తెలుగు అమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు కూడా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల అయ్యాయి.ఆ రెండు సాంగ్స్ సూపర్ హిట్ కూడా అయ్యాయి.

తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ అయినా పెళ్లి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.పట్టుచీరల తళతళలు.పట్ట గొలుసుల గలగలలు.అంటూ సాగే ఈ పాట మరొకసారి రాఘవేంద్రరావు మార్క్ చూపించింది.ఎంతో కలర్ ఫుల్ గా ఉన్న ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ కూడా ప్లస్ అయ్యిదనే చెప్పాలి.

విడుదల తేదీని త్వరలోనే ప్రకటించి మన ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు చిత్ర యూనిట్.

https://youtu.be/WpdEJsC4xGo

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube