కొత్త 'పెళ్లిసందడి' కనిపించడమే లేదు..?

తెలుగు సినీ రంగంలో దర్శకులలో స్టార్ట్ దర్శకుడైన రాఘవేంద్రరావు దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించినవే.

 Pelli Sandadi Sequel-TeluguStop.com

ఈయన ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కథను తెరకెక్కిస్తారు.ఒక ఇటీవలే ఆయనా ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

1996లో విడుదలైన పెళ్లి సందడి సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ నటించగా.

 Pelli Sandadi Sequel-కొత్త పెళ్లిసందడి’ కనిపించడమే లేదు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా మారింది.ఇక ఈ సినిమాను ప్రస్తుతం మోడ్రన్ పెళ్లి సందడి గా రాఘవేంద్రరావు పరిచయం చేయాలనుకున్నాడు.

అంతేకాకుండా ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్, హీరోయిన్ గా శ్రీ లీల చేయనున్న విషయాన్ని గతంలో తెలిపారు.అంతే కాకుండా ఈ సినిమా లో ఓ ఫోటో కూడా గతంలో షేర్ చేశారు.

అంతేకాకుండా ఈ సినిమాకు కీరవాణి తన సంగీతాన్ని అందిస్తున్నాడని, మరో కొత్త దర్శకుడు గౌరీ రోనంకి పరిచయం కానున్నాడని కూడా తెలిపారు.ఇక మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమా నిర్మాతలు గా వ్యవహరించనట్లు తెలుపగా.ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లు కానీ ఇప్పటి వరకు అందలేవు.అంతేకాకుండా శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి ఇంకా ట్రెండ్ గా ఉండగా తన కొడుకు రోషన్ నటిస్తున్న మోడ్రన్ పెళ్లి సందడి సినిమా కూడా అంత విజయాన్ని అందిస్తుందని, అంతే కాకుండా కొత్త ట్రెండ్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.

కానీ ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనలు లేక పోగా ఈ సినిమా ఉందా లేదా అంటూ అభిమానులలో సందేహాలు ఎదురవుతున్నాయి.

#Pellisandadi #Roshan #Srekanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు