25 ఏళ్ల పెళ్ళిసందడిని గుర్తు చేసుకున్న దర్శకేంద్రుడు  

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటే ఎన్నో మరుపురాని చిత్రాలు గుర్తుకొస్తాయి. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా అతని పేరు వినిపిస్తుంది.

TeluguStop.com - Pelli Sandadi Movie 25 Years Completed

అలాగే ఇండియన్ సినిమాలో పాటలని చిత్రీకరణలో రాఘవేంద్రరావుని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.బాలీవుడ్ దర్శకులు సైతం సాంగ్స్ చిత్రీకరణ కోసం అతనినే అనుసరించేవారు.

పాటలకి అందాన్ని తీసుకురావడంతో పాటు హీరోయిన్లు పళ్ళు,పూలతో హీరోయిన్ ని రొమాంటిక్ గా ఆవిష్కరించడంతో రాఘవేంద్రుడు దిట్ట.అలాంటి అతని కెరియర్ లో మరుపురాని సినిమాల జాబితాలో పెళ్లి సందడి ఒకటి.

TeluguStop.com - 25 ఏళ్ల పెళ్ళిసందడిని గుర్తు చేసుకున్న దర్శకేంద్రుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రేమకథా చిత్రాలలో కొత్త ఒరవడిని సృష్టించిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్.ఈ ఒక్క సినిమాతో శ్రీకాంత్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.

అంత వరకు ఓ మోస్తరుగా నడిచిన అతని కెరియర్ పెళ్లి సందడి సినిమాతో స్పీడ్ అందుకుంది.ఇక రాఘవేంద్రరావు కెరియర్ లో కూడా మరిచిపోలేని చిత్రంగా ఇది మిగిలిపోతుంది.

ఇక పెళ్లి సందడి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ఈ సినిమా జ్ఞాపకాలని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.పెళ్లి సందడి సినిమా విడుదలై 25 ఏళ్లు అయింది.నా కెరీర్‌, శ్రీకాంత్‌ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, జగదీష్‌ ప్రసాద్‌లకు నమస్కరిస్తున్నాను అంటూ దర్శకేంద్రుడు ట్వీట్ చేశారు.

ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమాని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీలతో చేస్తున్నాము.నా దర్శకత్వ పర్యవేక్షణలో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.త్వరలో థియేటర్లో కలుద్దాం అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తో పాటు శ్రీకాంత్ పెళ్ళిసందడి సినిమాకి సంబందించిన వీడియో, అలాగే రోషన్ పెళ్ళిసందడికి సంబందించిన వీడియో బైట్స్ కూడా షేర్ చేశారు.

#Roshan #Kiravani #Hero Srikanth #Allu Aravind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pelli Sandadi Movie 25 Years Completed Related Telugu News,Photos/Pics,Images..