మహేష్ బాబు చేతులు మీదుగా పెళ్లిసందD ట్రైలర్ రిలీజ్?

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకీ దర్శకత్వంలో రోషన్, శ్రీ లీలా జంటగా రూపొందుతున్న తాజా చిత్రం పెళ్లి సంద D ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ – ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా పెళ్లిసందడి సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

 Pelli Sandad Trailer Released By Mahesh Babu-TeluguStop.com

ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో నటించడం విశేషం.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విధంగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇందులో రోషన్ ఎంతో అద్భుతంగా నటించాడనీ తెలుస్తోంది.

Telugu Mahesh Babu, Pelli Sandadi, Raghvedra Rao, Roshan, Srikanth, Tollywood, T

అదే విధంగా ఈ సినిమా ద్వారా దర్శకేంద్రుడు మొట్టమొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే రోషన్ నాగార్జున నిర్మించినటువంటి నిర్మలా కాన్వెంట్ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు.ఆ తరువాత పెళ్లి సందD సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.మరి రోషన్ నటించిన పెళ్లి సందD” తన తండ్రి నటించిన పెళ్లి సందడి సినిమాను బీట్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube