పిడుగు పడే...పెళ్లి ఆగే..! ఇలా కూడా పెళ్లి ఆగిపోతుందా.? పెళ్లి కూతురు చెప్పిన కారణంకి షాక్!     2018-07-05   01:39:17  IST  Raghu V

ఒక పెళ్లి ఆగిపోవడానికి మనకు ఇప్పడు వరకు చాలా కారణాలు తెలిసి ఉంటాయి. కానీ బీహార్‌లో ఓ పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణమెంటో తెలిస్తే మీరు షాక్ కు గురవుతారు.

సర్నా జిల్లాలోని సోనేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రేసన్‌పూర్‌లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఉన్నట్టుండి వధువు ఈ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. ఈ హఠాత్ పరిణామంతో అతిథులంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటని షాకైన వరుడి తరపు బంధువులు కారణం ఏంటని ఆరా తీశారు.

అందరు ఆనందంగా పెళ్ళి ఇంట్లో ఉన్న సమవంలో వర్షాల వల్ల పెళ్ళిమండపం సమీపంలో ఎక్కడో పిడుగు పడింది. ఆ శబ్దానికి వరుడు భయపడ్డాడు.. కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా తనకీ వివాహం వద్దని చెప్పేసింది ఓ పెళ్లి కూతురు.. ఆ వరుడు విచిత్రంగా ప్రవర్తించాడని వధువు చెప్పింది. ఇంతగా భయపడిపోయే వాడిని పెళ్లి చేసుకోబోనని అందరి ముందూ చెప్పేసింది.

వధువు చెప్పిన కారణంతో షాకైన వరుడి తరపు బంధువులు గొడవకు దిగారు. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకునన పోలీసులు స్పాట్‌కు వెల్లి ఇరు వర్గాలకు సర్థిచెప్పడంతో పరిస్థితి సద్ధుమణిగింది. ఈ దాడి ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ వెరైటీ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.