రామ్ చరణ్ పరువు తీసిన పెళ్ళిచూపులు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి తెలుగు రాష్ట్రల్లో భారి మార్కెట్ ఉన్న సంగతి మనందరికి తెలిసిందే.మరీ ముఖ్యంగా సీడెడ్, ఉత్తరాంధ్ర, నెల్లూరు లాంటి ఏరియాల్లో పవన్ – మహేష్ కన్నా ఎక్కువ మార్కెట్ ఉన్న కథానాయకుడు చరణ్.

 Pelli Choopulu Hits Ram Charan In Overseas-TeluguStop.com

కాని విచిత్రంగా చరణ్ కి ఓవర్సీస్ మార్కేట్ పెద్దగా లేదు.ఓవైపు నాని లాంటి కుర్రహీరో ఓవర్సీస్ లో బ్రాండ్ గా ఎదుగుతోంటే … చరణ్ ఇంకా కష్టపడుతున్నాడు.

గోవిందుడు అందరివాడేలే సంపాదించిన $670k చరణ్ కి ఇప్పటివరకూ హయ్యెస్ట్ కలెక్షన్ ఓవర్సీస్ లో.రీసెంట్ బ్లాక్ బస్టర్ పెళ్ళి చూపులు రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్ ని దాటేసింది.ఇప్పటికే $700k కి పైగా వసూళ్ళు సాధించింది ఈ చిన్న సినిమా.

ఇప్పుడున్న ఊపుకి, బాబు బంగారం అడ్డుకుంటే తప్ప, పెళ్ళి చూపులు మిలియన్ డాలర్లు వసూలు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు.

ఎందుకంటే కొత్తగా విడుదలైన చిన్నసినిమాలేవి “పెళ్ళి చూపులు” స్పీడ్ కి బ్రేకులు వేయలేకపోతున్నాయి.

ఇక రామ్ చరణ్ ధృవ చిత్రంతో అయినా, తన విమర్శకులకు సమాధానం చెబుతాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube