బీచ్‌లో తెగ ఎంజాయ్ చేసిన పీవీ సింధు.. ఫొటోలు వైరల్!

Peevi Sindhu Enjoyed By The Tribe On The Beach Photos Go Viral

మన తెలుగమ్మాయి పీవీ సింధు భారత క్రీడా చరిత్రలో ఎన్నో రికార్డులను సృష్టించింది.బ్యాడ్మింటన్‌లో తనకు తానే సాటి అని చాలా సందర్భాల్లో నిరూపించింది.

 Peevi Sindhu Enjoyed By The Tribe On The Beach Photos Go Viral-TeluguStop.com

మొన్నీమధ్య జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కూడా కాంస్య పతకం సాధించింది.అయితే ఎప్పుడూ చేతిలో షటిల్ బ్యాట్, మరో చేతిలో కాక్ పట్టుకొని గేమ్ ఆడుతూ కనిపించే పీవీ సింధు.

అడపాదడపా చీరలు కూడా కడుతుంది.అలాగే ఆమెకు ఫ్యాషన్ లో చాలా మంచి అభిరుచి ఉంటుంది.

 Peevi Sindhu Enjoyed By The Tribe On The Beach Photos Go Viral-బీచ్‌లో తెగ ఎంజాయ్ చేసిన పీవీ సింధు.. ఫొటోలు వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పటికప్పుడు సరికొత్త మోడ్రన్ డ్రెస్సులతో ఆమె తరచూ మెరుస్తుంటుంది.ఇన్ స్టాగ్రామ్ లో చాలావరకు ఫ్యాషన్ డ్రెస్సులు ధరించిన సింధు ఫొటోలే మనకు దర్శనమిస్తాయి.

అయితే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.ఈ ఫొటోల్లో ఆమె బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.ఆ బీచ్‌కు అనుగుణంగా ఆమె ఎల్లో కలర్ క్రాప్ టాప్, ప్లయిన్ షార్ట్స్ ధరించి కనిపించింది.కెమెరా వైపు నవ్వుతూ పోజు ఇచ్చింది.అయితే ఈ పోస్ట్ కు.‘బీచ్ డైరీస్, త్రోబ్యాక్‘ అని క్యాప్షన్ జోడించింది.దాంతో గతంలో బీచ్‌లో దిగిన ఫొటోలు ఇప్పుడు తన అభిమానులతో పంచుకుందని తెలుస్తోంది.

అయితే సింధు ని ఇలా ఎన్నడూ చూడని నెటిజన్లు, అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.

సూపర్ క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వీటికి మూడు లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి.కొద్దిరోజుల క్రితం ఈ ప్లేయర్ నియాన్ గ్రీన్ డ్రెస్ ధరించి అందర్నీ కట్టిపడేసింది.హార్స్ రేసింగ్ ఈవెంట్ సందర్భంగా రూ.12 వేల విలువ ఉన్న గ్రీన్ డ్రెస్ ధరించి కనిపించింది.కెరీర్ పరంగా ప్రస్తుతం సింధు. ఒడెన్స్‌లో డెన్మార్క్ ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్ లో ఆడుతోంది.తాజాగా టర్కిష్, థాయిలాండ్ ప్లేయర్లను వరుసగా ఓడించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.ఆమె ఇప్పుడు క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన యాన్-యంగ్‌తో తలపడుతుంది.

#Spots #Enjoyed #Tennis #Beach #PV Sindhu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube