కోడిగుడ్డు తొక్క పడేస్తున్నారా? దానితో వారు లక్షలు సంపాదిస్తున్నారు.. ఎక్కడో తెలుసా?

కోడిగుడ్డు తొక్కని మనం తొక్కే కదాని పడేస్తాం.కానీ అక్కడ స్త్రీలు మాత్రం దాన్ని ఎంతో భద్రంగా దాచుకుంటారు.

 Peeling An Egg They Are Earning Lakhs With It , Egg Peal , Laksh , Income ,vira-TeluguStop.com

ఎందుకంటే దీనివలన అనేక ఉపయోగాలు వున్నాయి.ప్రతిరోజూ ఓ గుడ్డుని తినమని డాక్టర్ సూచిస్తాడు.

ఎందుకంటే, గుడ్డును రోజు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.అయితే గుడ్డు తినేసి తరువాత పొట్టుని బయట పడేస్తూ ఉంటాం.

అయితే ఈ గుడ్డు పొట్టును ఉపయోగించి కొందరు మహిళలు లక్షలు సంపాదిస్తున్నారు.అసలు దానివలన వారు ఎలా సంపాదిస్తున్నారు? వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Telugu Ambika, Calcium Powder, Chhattisgarh, Lakhs, Egg Peal, Eggs, Fertilizer,

కోడి గుడ్డు పొట్టుని మొక్కలకు ఎరువుగా వేస్తారు అనే విషయం మనకు తెలిసినదే.ఛత్తీస్ గడ్ లోని మహిళలు ఇంకాస్త ముందుకు వెళ్లి.వెరైటీగా ఆలోచించారు.అలా ఆలోచించారు కనుకే ఈ కోడి గుడ్డు పొట్టుతో వారు వ్యాపారం చేస్తున్నారు. అంబికా మునిసిపల్ కార్పొరేషన్ సహాయంతో, ఈ గుడ్ల పెంకులను ద్వారా ఆదాయం పొందుతున్నారు.జిల్లా కలెక్టర్ రీతూ సేన్ జిల్లాలోని మహిళా సాధికారత అవసరాన్ని ప్రచారం చేస్తున్నారు.

అంతేకాకుండా మహిళల అభివృద్ధి కోసం అక్కడ కృషి చేస్తున్నారు.స్వయం సహాయక సంఘాల సహాయంతో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నారు.

Telugu Ambika, Calcium Powder, Chhattisgarh, Lakhs, Egg Peal, Eggs, Fertilizer,

ఈ నేపథ్యంలో కోడిగుడ్డు పొట్టుతో కాల్షియం పౌడర్ తో పాటు మొక్కలకు ఎరువులను తయారు చేయడం పై అవగాహన కల్పించారు.ముందుగా వారు గుడ్డు పెంకులను నీటితో కడిగి, ఎండలో ఎండబెడతారు.దాని తరువాత ఆ గుడ్డు పెంకులను మెత్తగా దంచుతారు.అనంతరం ఆ పొడిని జల్లెడ పట్టి ఫిల్టర్ చేస్తారు.దానికోసం పశుసంవర్థక శాఖ కూడా వారికి పూర్తి సాయం చేస్తోంది.పూలు, పండ్లు, కూరగాయల పంటలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.ఇక్కడ కోడి గుడ్డు పౌడర్, కోడి గుడ్డు ఎరువులు రెండు కిలోలు రూ.200 నుంచి రూ.600 వరకు పలుకుతున్నాయి.ఇక్కడ మహిళ గ్రూపులు నెలకు 50 నుండి 60 కిలోల కోడి గుడ్డు పౌడర్ ని తయారు చేస్తున్నారు.

దాంతో నెలకు 12000 నుంచి 36000 వరకూ అదాయాన్ని పొందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube