అల‌క‌పూనిన పెద్దిరెడ్డి.. ఆ మీటింగుల‌కు డుమ్మా!

ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వ‌చ్చిద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.కాక‌పోతే ఆయ‌న చేరిక కొంద‌రికి ఇబ్బంది కూడా క‌లిగిస్తోంది.

 Peddireddy Hurts In The Matter Of Etela Rajender And Not Attended For Those Meet-TeluguStop.com

ఆయ‌నను బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకే తీసుకొస్తున్నారంటూ అప్ప‌ట్లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.ఇక దాంతో పాటే ఈట‌ల రాజేంద‌ర్ రాక‌ను మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు.

ఆయన్ను అడ‌గ‌కుండా ఎలా రానిస్తారంటూ బ‌హిరంగంగానే వ్య‌తిరేకించారు.

అయితే ఆయ‌న అప్ప‌టి నుంచి కాస్త అల‌క‌మీద‌నే ఉంటున్నారు.

కాగా ఆయ‌న్ను బుజ్జిగించ‌డానికి అన్ని రకాలుగా పార్టీ అధిష్టానం ప్ర‌య‌త్నించింది.కానీ ఆయ‌న మాత్రం త‌న పంథాను మార్చుకోవ‌ట్లేదు.

ఇదే క్ర‌మంలో రీసెంట్ గా హుజూరాబాద్‌లో నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ పార్టీ పదాధికారుల సమావేశాన్ని నిర్వ‌హించినా.దీనికి మాత్రం పెద్దిరెడ్డి మాత్రం రాలేదు.

ఆ స‌మావేశాలు జ‌రిగిన‌ప్పుడు పెద్దిరెడ్డి హుజూరాబాద్‌లోనే ఉన్నా.అల‌క పూని రాలేదు.

అంతే కాదు ఇప్ప‌టికీ ఆయ‌న ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌లువ‌కుండా అసంతృప్తిమీదే ఉన్నారు.

Telugu Bandi Sanjay, Peddi Reddy, Peddi, Peddi Trs-Telugu Political News

ఇదిలా ఉండ‌గా ఆయ‌న హుజూరాబాద్‌లో పోటీకి దిగుతాన‌ని ప్ర‌క‌టించి అప్ప‌ట్లోనే సంచ‌ల‌నం సృష్టించారు.త‌న మద్దతుదారులతో మాట్లాడి త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన పెద్దిరెడ్డి గ‌త రెండు రోజులుగా కొంద‌రు నేత‌లతోమంత‌నాలు సాగిస్తున్నారు.ఇక ఆయ‌న టీఆర్ ఎస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

టీఆర్ ఎస్ లోని కొంద‌రు నేత‌ల‌తో పెద్దిరెడ్డి రీసెంట్‌గా ట‌చ్ అయ్యారని రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.కానీ ఆయ‌న మాత్రం అలాంటివేవీ లేవ‌ని చెబుతున్నారు.

అయితే టీఆర్ ఎస్ కూడా పెద్దిరెడ్డిని త‌మ లిస్టులో ఉంచుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.కానీ టికెట్ హామీ ఇస్తే త‌ప్ప ఆయ‌న టీఆర్ ఎస్‌లో చేరే ఛాన్స్ లేదు.

ఇలంటి క్లిష్ట స‌మ‌యంలో రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఆయ‌న ఏ పార్టీలో అయినా చేరుతారా లేదంటే బీజేపీలోనే కొన‌సాగుతారా అన్న‌ది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube