తెలుగు రాష్ట్రాల్లో మేడారం తర్వాత అతి పెద్ద జన జాతర.. తప్పక తెలుసుకోవాల్సి పెద్దగట్టు విశేషాలు

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్‌ ఇండియాలో అతి పెద్ద జాతరగా మేడారం సమ్మక్క సారక్క జాతర సాగుతుంది.రెండు సంవత్సరాలకు ఒకసారి సాగే మేడారం జాతర తర్వాత తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతరగా గొల్ల గట్టు జాతర సాగుతుంది.

 Pedda Gollagattu Jatara Festival-TeluguStop.com

సూర్యపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలో ఉన్న లింగమంతుల స్వామి జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి జనాలు విపరీతంగా తరలి వస్తారు.సూర్యపేటకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గొల్ల గట్టు జాతర యాదవుల సాంప్రదాయ జాతరగా సాగుతూ వస్తోంది.

మేడారం జాతర గిరిజనుల పండుగ అయితే పెద్ద గట్టు జాతర మాత్రం యాదవుల జాతర.

వారం రోజుల పాటు హడావుడి ఉండే ఈ జాతరలో దాదాపు అయిదు లక్షల మంది పాల్గొంటారని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తుంది.

శ్రీకృష్ణ దేవరాయ కాలం నుండి ఈ జాతర ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.మహాశివుడిని ఇక్కడ లింగమంతుల స్వామిగా ఆరాధిస్తారు.గత వందల సంవత్సరాలుగా యాదవ కులంకు చెందిన బోయిన మరియు మున్న వంశస్థులు కలిసి ఈ జాతర నిర్వహిస్తూ ఉంటారు.మేడారం జాతర మాదిరిగానే ఈ జాతర కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి అన్నట్లుగా సాగుతుంది.

మేడారం జాతర సాగిన సంవత్సరం కాకుండా తర్వాత ఏడాది గొల్లగట్టు జాతర సాగుతుంది.

1998లో ఈ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం గుర్తించింది.200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జాతరకు యాదవులు గంపతో గుట్టకు చేరుకుంటారు.నాలుగు రోజుల పాటు గుట్టపై, గుట్ట కింద బోణం చేస్తారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మంత్రి జగదీశ్వరరెడ్డి చొరవతో ఈ జాతర మరింత విశిష్టతను సంతరించుకుంది.

ఈసారి జాతర ఫిబ్రవరి 24 నుండి ప్రారంభం కాబోతుంది.ఐదు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కనుక కోట్లల్లో వ్యాపారాలు జరుగుతాయి.

అదే విధంగా ఎగ్జిబీషన్‌ కూడా నిర్వహిస్తారు.రెండేళ్లకోసారి సాగే పెద్దగట్టు జాతరకు తప్పకుండా వెళ్తే బాగుంటుంది.

ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటే పెద్ద గట్టు జాతరకు వెళ్లండి.భక్తితో పాటు, అక్కడ ఎగ్జిబీషన్‌ పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది.

మీ స్నేహితులతో ఈ పెద్ద గట్టు జాతర గురించి షేర్‌ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube