ఒక నిర్మాత కేవలం డబ్బులు మాత్రమే పెట్టుబడి పెడతాడు.కానీ దర్శకుడు చెప్పిన కథ నమ్మి నిర్మాత ఎంత డబ్బుంటే అంత డబ్బు నీళ్ల ప్రాయంగా ఖర్చు పెడతాడు.
మరి అంత నమ్మకాన్ని పెట్టినప్పుడు దర్శకుడు ఎలా ఉండాలి ? ఎలా తన సినిమాను ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలగాలి ? కానీ ఈ మధ్య కాలంలో తల తోక తెలియకుండా అవసరానికి మించిన బడ్జెట్ పెట్టి నిర్మాతలను నిండా ముంచేస్తున్నారు కొంత మంది దర్శకులు.చాలా రోజులుగా ఇదే విషయంపై సోషల్ మీడియా( Social media )లో చర్చ జరుగుతూనే ఉంది.
ఇదే బాటలో ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల కూడా వచ్చే చేరిపోయాడు.

సినిమా తీయడం గొప్ప కాదు… చిన్న బడ్జెట్లో మంచి విజయాలను సాధించడమే ఇప్పుడున్న దర్శకులకు పెద్ద సవాల్.కానీ శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) లాంటి ఒక పేరు ఉన్న డైరెక్టర్ కూడా అవసరానికి మించి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా కి కోట్లు ఖర్చు పెట్టించడం అంటే అది చాలా పెద్ద విషయం.సినిమాలో తెలిసిన హీరో హీరోయిన్స్ లేరు… అంతకు మించిన కథ కూడా కాదు.
అయినా కూడా డైరెక్టర్ ను నమ్మి చాలా డబ్బు పెట్టాడు నిర్మాత.అయితే పెదకాపు వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది.
ఎందుకో జనాలకు ఆ చిత్రంపై ఆసక్తి కలగడం లేదు.

పైగా సినిమా కూడా టెక్నికల్ గా చాలా రిచ్ గా కనిపిస్తుంది.ఆ విలేజ్ సబ్జెక్టుకి అంతకన్నా గొప్పగా తీయడానికి ఏమి ఉండదు.కానీ దానికి అంత బడ్జెట్ పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.
పైగా ప్రమోషన్స్( Promotions ) కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చుపెట్టిన ఒక్కరు కూడా ఆ సినిమా చూడటం లేదంటే అసలు ఏ రకంగా కూడా మార్కెట్ లేదు అని అర్థం.అందుకే డబ్బులు ఖర్చు పెట్టేముందు ప్రొడ్యూసర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉంటుంది.