ధోనీ లానే ఈ పని చెయ్యండి.... లక్షలు సంపాదించండి!

కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం సంపాదించాలంటే అతి కష్టంతో కూడుకున్న పని.

 Ms Dhoni Pea Farming Awareness To Farmers, Indaia, Pea Farming, Ms Dhoni Organic-TeluguStop.com

అయితే ఇలాంటి వారికి జీవనోపాధి కల్పించడానికి ఎంఎస్ ధోని స్ఫూర్తిగా నిలబడ్డాడు. మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి మనకు తెలిసినదే.

క్రికెట్ కు దూరంగా ఉన్న ధోని ప్రస్తుతం తన ఫాంమ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
వ్యవసాయం పై ఎంతో ఇష్టం ఉండడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తరువాత రాంచీలోని తన ఫాంమ్ హౌస్ లో బఠాని పంటను సాగు చేశాడు.

దేశ వ్యాప్తంగా బఠానీ పంటకు అధిక డిమాండ్ ఉండడంతో ధోని ఈ పంటను సాగు చేశారు.అతి తక్కువ సమయంలోనే లక్షలలో రాబడిని సంపాదించవచ్చని ఈ పంట పండించడం ద్వారా రైతులు అధిక దిగుబడి, అధిక లాభాన్ని పొందవచ్చు అని తెలియజేశారు.

Telugu @dhoniism, @msdfansofficial, Farm, Indaia, Dhoni Organic, Dhonipea, Msdho

సాధారణంగా మన దేశంలో బఠానీ పంటను సెప్టెంబర్ నెలలో వేస్తారు.డిసెంబర్ లోగ పంట పూర్తవుతుంది.అయితే ఈ పంటను సాగు చేయడానికి ఎక్కువగా నీరు కూడా అవసరం లేకుండా కేవలం తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ఈ పంట అధికంగా పడుతుంది.మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలలో బఠానీ కిలో 60 నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతోంది.

Telugu @dhoniism, @msdfansofficial, Farm, Indaia, Dhoni Organic, Dhonipea, Msdho

అధిక డిమాండ్ కలిగి ఉన్న ఈ పంటను ఎంఎస్ ధోని పండించడానికి ఆసక్తి చూపి తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్నాడు.రైతులు కూడా ఈ పంటలు పండించడం వల్ల కేవలం నెలరోజుల్లోపే లక్షల్లో సంపాదించవచ్చు.కేవలం బఠానీ పంట మాత్రమే కాకుండా, రాంచి లోనే తన ఫామ్ హౌస్ లో కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.అయితే ఆరోగ్యపరంగా ఈ కోళ్లకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉండడంతో ఈ కోళ్ల పెంపకం కూడా ఎంఎస్ ధోని చేపడుతున్నట్లు ఇది వరకే మనకు తెలిసిన విషయం.

ఇలా పలు రకాల పనులను చేస్తూ ఎంతోమందికి ధోని ఆదర్శంగా నిలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube