డ‌యాబెటిస్ ఉందా..అయితే ఈ పండు తినాల్సిందే?

డ‌యాబెటిస్‌.దీనినే కొంద‌రు మ‌ధుమేహం అని, మ‌రికొంద‌రు షుగ‌ర్ వ్యాధి అని కూడా పిలుస్తారు.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే.మ‌ధుమేహం బారిన ప‌డ‌తారు.ఇక మ‌ధుమేహం వ‌చ్చిందంటే.ఆయిలీ ఫుడ్స్‌, సాల్ట్ ఎక్కువగా ఉండే చిరుతిళ్లు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవ‌డం మానేయాలి.

 Pears Can  Regulate Blood Sugar Levels! Pears Fruit, Benefits Of Pears Fruit, Pe-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే చాలా మంది పండ్ల‌కు కూడా దూరంగా ఉంటారు.ఎందుకంటే, అవి తీయగా ఉంటాయి కాబ‌ట్టి.

డ‌యాబెటిస్ ఉన్న వారు పండ్లు తిన‌కూడ‌ద‌ని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తారు.అలా అని అన్నీ తిన‌డం మానేమ‌ని కాదు.నిజానికి మధుమేహం రోగులు తినగలిగే పండ్లు కొన్ని ఉన్నాయి.అలాంటి వాటిలో పియర్స్ పండు ఒక‌టి.

పియ‌ర్స్ పండులో ఫైబర్ ఎక్కువ‌గా, కార్బోహైడ్రేట్స్ మ‌రియు కేలరీలు త‌క్కువ‌గా ఉంటాయి.అలాగే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, విట‌మిన్ సి, విట‌మిన్ కె, ఫైబ‌ర్‌, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోష‌కాలెన్నో పియ‌ర్స్ పండులో ఉంటాయి.

అందుకే పియ‌ర్స్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు పియ‌ర్స్ పండు తింటే.అందులో ఉండే ఫైబ‌ర్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుతాయి.అదే స‌మ‌యంలో అధిక బ‌రువును కూడా త‌గ్గిస్తాయి.

అందువ‌ల్ల‌, ఎవ‌రైతే డ‌యాబెటిస్‌తో బాధ ప‌డుతున్నారో వారు రెగ్యుల‌ర్‌గా ఒక పియ‌ర్స్ పండు తింటే మంచిది.

Telugu Benefitspears, Sugar Levels, Diabetes, Tips, Latest, Pears Fruit-Telugu H

అయితే ఆరోగ్యానికి మంచిద‌నో, రుచిగా ఉన్నాయ‌నో చెప్పి ఈ పండ్ల‌ను అతిగా మాత్రం తీసుకోకండి.అతిగా తింటే.అదే ప్ర‌మాదంగా మారుతుంది.

ఇక పియ‌ర్స్ పండుతో పాటు జామ కాయ‌, నేరుడు పండ్లు, చెర్రీస్‌, అంజీర‌, దానిమ్మ‌, బొప్పాయి, యాపిల్, నారింజ‌, అవొక‌డో వంటి పండ్ల‌ను కూడా మ‌ధుమేహం రోగులు తీసుకోవ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube