మనం నెమళ్లను చూస్తే వావ్‌ అనుకుంటాం, కాని వారు మాత్రం చిరాకు పడుతున్నారు.. ఎందుకో తెలుసా?

కొన్ని ప్రాంతాల్లో నెమళ్లు అస్సలు కనిపించవు.అలాంటి వారు ఎక్కడైనా జూ కు వెళ్లినప్పుడు లేదంటే ఏదైనా అటవి ప్రాంతంకు వెళ్లిన సమయంలో నెమళ్లు కనిపిస్తే ఆశ్చర్యంతో వారి మొహం వెలిగి పోతుంది.

 Peacocks Overrun Frustrated British Columbia-TeluguStop.com

అర్రె నెమళ్లు అంటూ పక్కన ఉన్న వారిని గిచ్చి మరీ చెబుతూ ఉంటారు.ఇక అవి కళ్ల ముందు పురి విప్పితే ఆనందం అంతా ఇంతా ఉండదు.

వాటిని తమ మొబైల్స్‌లో బంధించిన తాను చూశాను అంటూ చెప్పుకుంటారు.మన దేశంలో నెమళ్లు చాలా అరుదుగా ఉంటాయి.

అందువల్ల మనదేశంలోని ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది.కాని కొన్ని దేశాల్లో నెమళ్లు ఎక్కువగా ఉన్నాయి.

వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందట.

కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రాంత ప్రజలు నెమళ్ల కారణంగా గత పది పదిహేను సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

వేలాది మంది నెమళ్ల కారణంగా ఆ ప్రాంతాలను కూడా వదిలి వెళ్లి పోయారంటే అర్థం చేసుకోవచ్చు.స్థానికంగా నెమళ్లు వారిని ఏ స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నాయో వారు చెబుతుంటే మన దేశం వారు నోరు వెళ్లబెట్టాల్సిందే.

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోతులు నానా బీభత్సం చేస్తూ ఉంటాయి.అలాగే అక్కడ నెమళ్లు వారిని చిరాకు పెడుతూ ఉంటాయట.

మనం నెమళ్లను చూస్తే వావ్‌ అను�

నెమళ్లు అక్కడ విసర్జించే పెంట అత్యంత దుర్వాసన వెద జల్లుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.దుర్వాసన కారణంగా భయంకరమైన వ్యాదులు కూడా సోకుతున్నట్లుగా చెబుతున్నారు.నెమళ్లను పట్టేందుకు స్థానిక అధికారులు పెద్ద ఎత్తున బోనులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.బోనుల్లో పడ్డ నెమళ్లను సుదూర ప్రాంతాల్లో వదిలేసి వస్తున్నారు.ఎంతగా ప్రయత్నించినా కూడా అక్కడ నెమళ్ల వల్ల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు.అదే ప్రాంతానికి చెందిన కొందరు నెమళ్లను పెంపుడు పక్షుల మాదిరిగా పెంచుతూ వందల సంఖ్యలో వాటిని మరింత ఎక్కువగా చేస్తున్నారు.

దాంతో వాటిని తొలగించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.మన వద్ద కోతుల సమస్యలా అక్కడ నెమళ్ల సమస్య అన్నమాట.

అందుకే ఏదైనా పరిమితిని దాటకుండా ఉంటేనే బెటర్‌, అతి అయితే బాగోదు అని మన పెద్దలు అంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube