ఎండకు తట్టుకోలేక పడిపోయిన నెమలి....సెలైన్ ఎక్కించారు

ఎండకు తట్టుకోలేక పడిపోయిన నెమలి….సెలైన్ ఎక్కించారు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దీ రోజులు గా ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే.

 Peacock Got Sunstroke-TeluguStop.com

అయితే ఈ ఎండల తాపానికి అటు జనాలు తట్టుకోలేక పోతున్నారు.ఈ క్రమంలో 17 మంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు.

అయితే ఈ ఎండల కారణంగా మనుషులే కాకుండా మూగ జీవాలు కూడా పడరాని ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో మన జాతీయ పక్షి నెమలి వేడిగాలి తట్టుకోలేక ఎక్కడ నీరు కనపడితే అక్కడ వాలిపోతుంది.

ఈ ఘటన జనగామ శివారు లో చోటుచేసుకుంది.వేడి గాలులు తట్టుకోలేక ఒక నెమలి బోరు వద్ద వస్తున్న నీటి వద్దకు వెళ్లి.కాసేపు సేదతీరింది.అయినప్పటికీ పాపం ఆ నెమలి అది స్పృహ కోల్పోయిందట.

దీనితో అక్కడి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడం తో ఆంబులెన్స్ ను తీసుకువచ్చి వెంటనే ఆ నెమలి కి చికిత్స అందించారు.ఈ క్రమంలో ఆ నెమలి కి సెలైన్ కూడా పెట్టాల్సి వచ్చిందట.

అయినా ఈ ఎండలకు ప్రజలే తట్టుకోలేక పోతుంటే పాపం మూగ జీవాలు అవి మాత్రం ఎంత అని తట్టుకుంటాయి.అందుకే ఆ మూగ జీవికి కూడా సెలైన్ ఎక్కించాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube