ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు ! కేసీఆర్, హరీష్ పైనా ...?

Pcc President Revanth Reddy Sensational Comments On Kcr

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆయన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, మంత్రి హరీష్ ను టార్గెట్ చేసుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 Pcc President Revanth Reddy Sensational Comments On Kcr-TeluguStop.com

హుజురాబాద్ లో వ్యాపారులు,  నిరుద్యోగులు ఫీల్డ్ అసిస్టెంట్లను మంత్రి హరీష్ రావు బెదిరిస్తున్నారని,  చిల్లర రాజకీయాలకు తెర తీసి , ఖాసీం రజ్వీ ని తలపిస్తున్నాడు అంటూ రేవంత్ సంచలన విమర్శలు చేశారు.  నిజాం నవాబులు ఆధిపత్యం కోసం రజాకార్లను నియమించుకున్నారని, కెసిఆర్ నిజాం అయితే .ఖాసీం రిజ్వీ హరీష్ రావు అంటూ విమర్శించారు.
   పోలీస్ శాఖ విషయం పైన ఆయన స్పందించారు.

పోలీస్ శాఖలో స్పీట్ వచ్చిందని, పోలీస్ శాఖ రెండుగా చీలిపోయిందని, రాష్ట్ర డిజిపి ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు.ప్రభాకర్ రావు కి ప్రభుత్వం అప్పగించిన రెండు పనుల్లో రేవంత్ రెడ్డి,  డిజిపి ఫోన్ ట్యాపింగ్ చేయడమేనని అన్నారు.

 Pcc President Revanth Reddy Sensational Comments On Kcr-ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు కేసీఆర్, హరీష్ పైనా …-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రిటైర్డ్ అయిన డిఎస్పి వేణుగోపాలరావు వద్ద 32 మంది తో నిఘా పెట్టారన్నారు.బీజేపీ మీద నరసింహారావు నిఘా పెట్టారు.డీజీపీ కూడా భయం భయంగా బతుకుతున్నారు.ఐపీఎస్ లో ఓ సామాజిక వర్గం ను దొంగల్లా చూస్తున్నారు.

ఆ సామాజిక వర్గం ఐపీఎస్ లు మాకు పోస్టింగ్ లు వద్దు అనే పరిస్థితికి వచ్చింది అంటూ విమర్శించారు.
  

తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇటువంటి నిఘా లేదు .రిటైర్డ్ అయిన కొంతమంది సొంతంగా పెట్టి వ్యవస్థలు నడిపిస్తున్నారు.సిటీ చుట్టుముట్టు తన వారికి పోస్టింగ్ లు వేశారు.

పోలీస్ శాఖలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది.ఏపీకి చెందిన కెసిఆర్ బంధువుని డిప్యుటేషన్ పై తెప్పించారు అంటూ రేవంత్ విమర్శించారు.

హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి రావడం లేదు అంటూ టిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు ? సమీక్షలు, కేటీఆర్  ప్లీనరీ పేరు తో వంటకాలు చేస్తున్నారు.బెంజ్ కారులో బతుకమ్మతో కవిత బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ఆట పాట ఆడుతున్నారు అంటూ రేవంత్ విమర్శించారు. 

.

#Hujurabad #Burj Kaleef #Telangana #Balmuri Venkat #Telangana Cm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube