మరణించిన ప్రముఖ మలయాళ నటుడు.. !

మరణానికి సమయం లేదు.ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వచ్చి ప్రాణాలు తీసుకుపోతుంది.

 Famous Malayalam Actor Pc Soman Died , Malayalam, Actor, Dead, Pc Soman, Kerala-TeluguStop.com

ఇలానే ఎందరో ప్రముఖులైన వారు అకస్మాత్తుగా మృతి చెందిన రోజులు ఉన్నాయి.

ఇకపోతే నాట‌క రంగంలో, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన కేర‌ళ‌కు చెందిన పీసీ సోమ‌న్ (81) మృతి చెందారు.

గ‌త కొంత‌కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆయన బాధ‌ప‌డుతున్న సోమన్ ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్రవారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

ఇక మలయాళ న‌టుడు పీసీ సోమ‌న్ స్వ‌యం వ‌రం, విధేయ‌న్‌, మ‌తిలుక‌ల్ లాంటి సూప‌ర్ ‌హిట్ సినిమాల్లో న‌టించి ప్రేక్షకులను మెప్పించారు.

అదీగాక కౌర‌వార్‌, ధృవం, ఫైర్ మ్యాన్ లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు కూడా తెచ్చాయి.

ఇకపోతే పీసీ సోమ‌న్ మొత్తం 300 ల‌కు పైగా సినిమాల్లో న‌టించారు.

కాగా సోమన్ మృతికి కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ తో స‌హా ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతున్ని వేడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube