యూజర్లకు శుభవార్త చెబుతున్న పేటీఎం .. !

ప్రస్తుతం దేశం కరోనా వైరస్ ప్రకంపనలకు అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే.బయటకు వెళ్లితే ఎవరి ద్వారా కరోనా వ్యాపిస్తుందో తెలియని పరిస్దితుల్లో ప్రజలు జీవనాన్ని సాగిస్తున్నారు.

 Paytm Telling Good News To User-TeluguStop.com

ఇలాంటి సమయంలో వీలైనంతగా ఇంటి నుండే తమ పనులను గానీ, ఉద్యోగ ధర్మాలను గానీ నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉండగా కోవిడ్ తో బాధపడుతున్న వారు కరోనా వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుందో అని ఆందోళన చెందడం జరుగుతుంది.

అందుకే డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం పేటీఎం తమ యూజర్లకు ఒక శుభవార్త చెప్పింది.

 Paytm Telling Good News To User-యూజర్లకు శుభవార్త చెబుతున్న పేటీఎం .. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్ యాప్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చి అందులో కరోనా వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందన్న సమాచారంతో పాటు టైమ్‌స్లాట్ తదితర వివరాలను యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది.

ఇక ఈ యాప్‌ లో మొత్తం 780 జిల్లాల్లో వ్యాక్సిన్ లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని అందించనున్నట్టు, ఏజ్ గ్రూప్, పిన్ కోడ్‌ల ద్వారా కూడా ఈ వివరాలను తెలుసుకో వచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తన ట్వీట్‌ద్వారా తెలియచేస్తున్నారట.కాబట్టి పేటీఎం వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు వెల్లడిస్తున్నారు.

#PAYTM #Covid Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు