టీడీపీ నేత పయ్యావులకు అస్వస్థత  

Payyavula Kesavu Suffer From Health Problem-payyavula Kesavu,telugudesham Party Leadrer,uravakonda Mla

తెలుగు దేశం పార్టీలో సీనియర్‌ నేతగా గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం ఉరవకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్న పయ్యావుల కేశవ్‌ పీఏసీ చైర్మన్‌గా ఉన్న విషయం తెల్సిందే.అసెంబ్లీలో పీఏసీ భేటీ జరుగుతున్న సమయంలో ఉన్నట్లుండి ఆయనకు వాంతులు అయ్యాయి.అనారోగ్యంతో ఆయన నీరసించాడు.కళ్లు తిరుగుతున్నట్లుగా ఉండటంతో వెంటనే అసెంబ్లీలోనే ఉండే వైద్య సేవా కేంద్రంకు తీసుకు వెళ్లారు.

Payyavula Kesavu Suffer From Health Problem-payyavula Kesavu,telugudesham Party Leadrer,uravakonda Mla-Payyavula Kesavu Suffer From Health Problem-Payyavula Telugudesham Party Leadrer Uravakonda Mla

అక్కడ పయ్యావులకు ప్రధమ చికిత్స జరిపారు.ఆ తర్వాత పయ్యావుల కేశవ్‌ను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించినట్లుగా తెలుస్తోంది.పయ్యావుల కేశవ్‌ ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కూడా వాకబు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం పయ్యావుల కేశవ్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యాడని, అంతకు మించి ఏం లేదు అంటూ హాస్పిటల్‌ ప్రకటించింది.ఆయన్ను వెంటనే డిశ్చార్జ్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.