అభిమానులకు సలహాలు ఇస్తున్న పాయల్ రాజపుత్.. ఏ విషయంలో అంటే?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది.

 Payal Rajputh Giving Suggestion To Her Fans About Covid 19 Vaccines-TeluguStop.com

అంతేకాకుండా తన నటనకు మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక తన గ్లామర్ తో కుర్రాళ్లను కన్నార్పకుండా చేస్తుంది.

అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Payal Rajputh Giving Suggestion To Her Fans About Covid 19 Vaccines-అభిమానులకు సలహాలు ఇస్తున్న పాయల్ రాజపుత్.. ఏ విషయంలో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


పంజాబీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ హాట్ బ్యూటీ.ఆ తర్వాత 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.

ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించిన రాయల్.తన నెగిటివ్ రోల్ కి మంచి గుర్తింపు అందింది.ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించగా అంతా సక్సెస్ ను అందుకోలేకపోయింది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన అభిమానులకు కొన్ని సలహాలు ఇచ్చింది ఈ బ్యూటీ.


ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.

కరోనా వైరస్ వల్ల.ప్రస్తుతం పరిస్థితులన్నీ దారుణంగా మారాయి.

ఇక చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.దీనివల్ల చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు.

ఇక ఈ విషయం గురించి తాను తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.ఇప్పటికే పాయల్ ప్రజలకు వైరస్ గురించి పలు జాగ్రత్తలు తెలుపుతూనే వుంది.

ఇక తాజాగా తాను వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోలు షేర్ చేయగా.అందరూ జాగ్రత్తగా ఉండాలని.

దాంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని కోరింది.అంతేకాకుండా తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలంటూ తెలిపింది.

ఇక తనకు వ్యాక్సిన్ తర్వాత కొద్దిసేపటి వరకు జ్వరం, శరీర నొప్పులు వచ్చాయని.కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాలని తెలిపింది.

#Payal Rajput #COVID-19 #PayalRajput #PayalRajput #Suggestions

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు