అర్జున్ రెడ్డితో ఆర్ఎక్స్ పాప.. మామూలుగా ఉండదట!

టాలీవుడ్‌లో బోల్డ్ కంటెంట్ సినిమాగా ట్రెండ్ సెట్ చేసిన మూవీ అర్జున్ రెడ్డి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో రొమాన్స్‌ను ఇంత బోల్డ్‌గా కూడా చూపించవచ్చని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిరూపించాడు.

 Payal Rajput Wants To Work With Sandeep Reddy Vanga, Payal Rajput, Sandeep Reddy-TeluguStop.com

ఇక ఈ సినిమా టీజర్ మొదలుకొని సినిమా రిలీజ్ అయ్యేవరకు ప్రతి అంశమూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది.కాగా ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో తన కెరీర్‌ను టాప్ స్టేటస్‌లో సెట్ చేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.

కాగా ఈ సినిమా స్పూర్తితో టాలీవుడ్‌లో వచ్చిన మరో బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఆర్ఎక్స్ 100 కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది అందాల భామ పాయల్ రాజ్‌పుత్.

అయితే ఈ బ్యూటీకి ఎప్పటినుండో ఓ కోరిక ఉందని తాజాగా వెల్లడించింది.తనకు అర్జున్ రెడ్డి చిత్రం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన పాయల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక్క సినిమానైనా చేయాలని ఉందని ఆమె తెలిపింది.

అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు రెడీ అవుతుండటంతో పాయల్ చేసిన కామెంట్స్ ఆసక్తిని సంతరించుకున్నాయి.ఒకవేళ విజయ్ దేవరకండతో గనక పాయల్ జోడీ కడితే ఆ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి సందీప్ రెడ్డి పాయల్‌కు అవకాశం ఇస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా పాయల్ ప్లాన్ మాత్రం మామూలుగా లేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube