రౌడీతో రొమాన్స్ చేస్తానంటోన్న పాప

ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యేవారిని అదృష్టవంతులు అంటారు.కానీ వారికి ట్యాలెంట్ కూడా ఉంటే వారు నిజంగా అర్హులని, వారిని గుర్తించిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతారు.

 Payal Rajput, Vijay Devarakonda, Rx100, Arjun Reddy-TeluguStop.com

ఇదే కోవలోకి చెందింది అందాల భామ పాయల్ రాజ్‌పుత్.ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ, వరుసగా ఆఫర్లు కొల్లగొడుతోంది.

ఆర్ఎక్స్100 చిత్రంలో ఆమె అందాల ఆరబోతతో పాటు బోల్డ్ రొమాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.కాగా ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, తన మనసులోని కోరికను బయటపెట్టింది.

టాలీవుడ్‌లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, అందులో నటించిన విజయ్ దేవరకొండతో ఎప్పటికైనా రొమాన్స్ చేయాలని ఉందని ఆమె చెప్పుకొచ్చింది.అసలే రౌడీ హీరో, ఆపై పాయల్ లాంటి బ్యూటీ రొమాన్స్‌కు సై అంటే ఇక ఆ సినిమా ఎలాంటి ఫైర్‌ను క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే అంటున్నారు సినీ ప్రేమికులు.

కాగా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పాయల్ రాజ్‌పుత్ ఇంటికే పరిమితం అయినా, సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌కు కనులవిందును అందిస్తోంది.మరి ఈ బ్యూటీ రౌడీతో రొమాన్స్ ఎప్పుడు చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube