పాయల్ పాపకు పెరిగిన డిమాండ్.. మామూలుగా లేదుగా!  

టాలీవుడ్‌లో ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ కొట్టేసిన వారు చాలా మంది ఉన్నారు.వారిలో అందాల భామ పాయల్ రాజ్‌పుత్ కూడా ఒకరు.

TeluguStop.com - Payal Rajput To Sign More Projects In Digital World

ఆర్ఎక్స్ 100 అనే బోల్డ్ లవ్ స్టోరి చిత్రంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ బ్యూటీ, ఇంకా ఆ సినిమా ట్యాగ్‌తోనే పిలవబడుతుందంటే, ఆమెకు ఆర్ఎక్స్100 చిత్రం ఎలాంటి క్రేజ్‌ను తెచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.కాగా ఈ బ్యూటీ ఆర్ఎక్స్ 100 చిత్రంలో తన హాట్ హాట్ అందాల విందుతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇక ఆర్ఎక్స్ 100 తరువాత పాయల్ పాప ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు మాత్రం రావడం లేదు.దీంతో అందాల ప్రదర్శనకు మాత్రమే కాకుండా నటనకు పెద్దపీట వేసే పాత్రలు చేసేందుకు కూడా ఈ బ్యూటీ సై అంటోంది.

TeluguStop.com - పాయల్ పాపకు పెరిగిన డిమాండ్.. మామూలుగా లేదుగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ప్రస్తుతం వెబ్ కంటెంట్‌కు అదిరిపోయే క్రేజ్ ఉందని గ్రహించిన ఈ బ్యూటీ, అందులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.ఇటీవల ‘అనగనగా ఓ అతిథి’ అంటూ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మంచి హిట్‌ను అందుకుంది.

ఈ వెబ్ సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటించి మెప్పించిన పాయల్, ఇకపై మరిన్ని వెబ్ చిత్రాలను ఓకే చేసేందుకు రెడీ అవుతోంది.

తాను నటించిన తొలి వెబ్ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాయల్ రాజ్‌పుత్ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా తాను సినిమాలు చేస్తానని, అందాల ప్రదర్శనే కాకుండా పాత్ర డిమాండ్ మేరకు డీగ్లామర్ పాత్రలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించేందుకు తాను రెడీ అంటోంది ఈ బ్యూటీ.ఏదేమైనా చాలా గ్యాప్ తరువాత పాయల్ పాప నటనకు మంచి మార్కులు పడటంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక వరుసబెట్టి వెబ్ చిత్రాలు చేసేందుకు ఆమె నిర్ణయించుకోవడం మంచి విషయమే అని వారు అంటున్నారు.

#Rx100 #Payal Rajput #AnaganagaOka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు