ఆ విషయంలో సమంతని ఫాలో అవుతున్న పాయల్ రాజ్ పుత్

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అందాల భామ పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమాతోనే బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ కాలేకపోయిన అవకాశాలు మాత్రం చేతినిండా ఉన్నాయి.

 Payal Rajput Started New Business, Tollywood, Telugu Cinema, South Cinema, Saman-TeluguStop.com

సోలో హీరోయిన్ గా ఫీమేల్ సెంట్రిక్ కథలతో సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తుంది.ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో అనగనగా ఒక అతిథి అనే సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.ఇందులో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తుంది.

కేవలం నాలుగు పాత్రల చుట్టూ నడిచే ఈ సినిమా త్వరలో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఇదిలా ఉంటే హీరోయిన్ గా రాణిస్తున్న ఈ అమ్మడు ఈ మధ్య కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టింది.

ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది.

Telugu Wears, Payal Rajput, Samantha, Telugu, Tollywood-Latest News - Telugu

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ భామలు హీరోయిన్స్ గా చేస్తూ బ్యాక్ అప్ గా ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు. రకుల్, సమంత ఆ దారిలోనే ఉన్నారు.సమంత సాకి పేరుతో దుస్తుల బ్రాండును ప్రారంభించిన సంగతి విదితమే.

ఇప్పుడు అదే కోవలో పాయల్ రాజ్ పుత్ కూడా గూమ్ ఫై పేరిట దుస్తుల వ్యాపారం చేయనుంది.ఇప్పటికే తన వ్యాపారానికి సంబంధించి అన్ని పనులు పూర్తయిపోయాయని తెలిపింది.

త్వరలో ప్రారంభం కాబోతుంది అని స్పష్టం చేసింది.లేటెస్ట్, మోడరన్ డిజైనర్ కలెక్షన్స్ గూమ్ పై ద్వారా అందించనున్నట్లు పేర్కొంది.

మొత్తానికి స్టార్ హీరోయిన్ సమంత కొత్త హీరోయిన్లు అందరికి ఏదో ఒక రూపంలోఆదర్శంగా నిలుస్తుందని పాయ్ రాజ్ పుత్ బిజినెస్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube