గృహహింసపై షార్ట్ ఫిల్మ్ చేసిన పాయల్ రాజ్ పుత్

మన సమాజంలో ఇప్పటికి ఆడవాళ్ళపై ఆధిపత్యం, గృహహింస, సామాజిక కట్టుబాట్లు మాటున ఆడవాళ్ళపై వేధింపులు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం.ఇలాంటి వాటిపై మహిళలలలో ఎంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన, అలాగే చట్టాలు తీసుకొచ్చిన కూడా మార్పు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.

 Payal Rajput Short Film On House Harassment, Tollywood, Lock Down, Telugu Cinema-TeluguStop.com

సామాజిక కట్టుబాట్లు మద్యం స్త్రీ శారీరక హింసకి గురవుతూనే ఉంది.ఇలాంటి కథలపై సినిమాలు కూడా వస్తున్నాయి.

కాని మార్పు ఇంకా మొదలు కాలేదు.ఇదిలా ఉంటే లాక్ డౌన్ టైంలో మన ఆర్ఎక్స్ భామ పాయల్ రాజ్ పుత్ ఇదే కాన్సెప్ట్ మీద ఒక షార్ట్ ఫిలిం తీసింది.

లాక్ డౌన్ టైంలో గృహహింస ఎక్కువైందని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో ఆమె చేసిన షార్ట్ ఫిలిం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

24గంటల్లో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలిమ్ లో భర్త చేసే హింస వల్ల భార్య ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూపించారు.ఈ లఘుచిత్రంలో పాయల్ రాజ్ పుత్ గృహిణిగా ఉంటూనే రైటర్ గా పనిచేస్తుంది.

అయితే తన భర్తవల్ల ఆమె ఏమీ రాయలేకపోతుంది.ప్రతీ సారీ ఏదో ఒక విషయమై ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది.

భర్త హింస రోజు రోజుకీ పెరిగిపోవడంతో ఒకానొక రోజు అతన్ని చంపేస్తుంది.స్థూలంగా ఇదే స్టోరీ.ఈ షార్ట్ ఫిల్మ్ ని పాయల్ స్నేహితుడు సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించాడు.16 నిమిషాల నిడివగల ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా పాయల్ మంచి ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.గృహహింస నుంచి బయట పడటానికి సమాజంలో మహిళలు ఎంతగా పోరాడుతున్నారో అనే విషయాలని ఈ షార్ట్ ఫిలింలో చూపించే ప్రయత్నం చేశారు.మొత్తానికి పాయల్ చేసిన ఈ ప్రయత్నంకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube