రాములమ్మ తన ఇన్సిపిరేషన్ అంటున్న పాయల్ పాప...  

Payal Rajput Sensational Comments On Vijayashanthi - Telugu Payal Rajput, Payal Rajput 5ws Movie News, Payal Rajput Comments On Vijayashanthi, Payal Rajput Latest News, Payal Rajput Movie News, Payal Rajput News

తెలుగులో దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించినటువంటి ఆర్ఎక్స్100 చిత్రంలో హీరో కార్తికేయ సరసన నటించిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే తాజాగా పాయల్ రాజ్ పుత్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది ఇందులో భాగంగా తానూ ప్రస్తుతం నటిస్తున్న 5ws అనే చిత్రం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షుకులకు తెలిపింది.

Payal Rajput Sensational Comments On Vijayashanthi

ఇందులో భాగంగా తాను ప్రస్తుతం నటిస్తున్న టువంటి 5ws చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తున్నాడని అలాగే ఈ చిత్రాన్ని యశోదా ఠాకూర్ నిర్మిస్తున్నారని తెలిపింది.అంతేగాక తాను ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నానని అందుకు టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది.

  దీనికోసం గతంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయశాంతి నటించినటువంటి చిత్రాలను చూశానని అందులో విజయశాంతి చాలా గొప్పగా నటించిండమేగాక తన పాత్రకి తగ్గట్లుగా హావభావాలు పలికిస్తూ 100% న్యాయం చేసిందని విజయశాంతిని పొగిడింది.

రాములమ్మ తన ఇన్సిపిరేషన్ అంటున్న పాయల్ పాప…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా పాయల్ రాజ్ పుత్ వచ్చీరావడంతోనే ఆర్ఎక్స్100 చిత్రంతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్డిఎక్స్ లవ్, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు వంటి చిత్రాలు ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఈ అమ్మడు అడపాదడపా స్పెషల్ గీతాల్లో నటిస్తూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.అయితే ఈ మధ్య కాలంలో పాయల్ రాజ్ పుత్ నటించినటువంటి వెంకీ మామ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

దీంతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడింది పాయల్ రాజ్ పుత్.మరి పాయాల్ పాపని  గ్లామర్ డాల్ గా ఆదరించినటువంటి తెలుగు ప్రేక్షకులు సీరియస్ యాంగిల్ లో యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు