ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్‌నైట్ పాపులర్ అయిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ఈ బ్యూటీకి ఆ సినిమా సమయంలో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అయితే ఆ తరువాత వరుసగా సినిమాలు చేయకుండా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.ఇటీవల వెంకటేష్, నాగచైతన్యల మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’ సినిమాతో మనముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా తన కెరీర్‌ను నాశనం చేసిందంటూ వాపోతుంది.
ఇంతకీ ఆ సినిమా పాయల్ కెరీర్‌ను ఎలా నాశనం చేసిందని అనుకుంటున్నారా? ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ లుక్స్ పరంగా చాలా నిరాశపరిచింది.అయితే ఆమెను మరీ ఆంటీలా చూపించిన క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా దర్శకుడు బాబీదే అని చెప్పాలి.
ఈ సినిమాలో వెంకీ జోడీగా నటించినంత మాత్రాన ఆమెను కూడా ఆంటీలా చూపించడం ఏమిటని ఆమె వాపోతుంది.ఈ ఒక్క పాత్ర కారణంగా తనకు సరైన పాత్రలు రావడం లేదని ఆమె అంటోంది.
ఇలా ఒక్క సినిమా తన కెరీర్న నాశనం చేసేదిగా ఉండటం నిజంగా బాధాకరమిన పాయల్ అంటోంది.ఇక ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాల మినహా పెద్ద ఆఫర్లు ఏమీ లేకపోవడంతో ఈ బ్యూటీ నిరాశ చెందుతోంది.
మరి ఈ హాట్ బ్యూటీకి మళ్లీ ఆర్ఎక్స్ 100 లాంటి క్రేజ్ తెచ్చే సినిమా ఎప్పుడు పడుతుందా అని అభిమానులు చూస్తున్నారు.