పాయల్‌ కెరీర్‌లో మళ్లీ ఆ అద్బుతం జరిగేనా?

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో హీరోయిన్‌గా మెప్పించిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌ అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమాలో ఈ అమ్మడు విలనిజంతో నటించడంతో పాటు రొమాంటిక్‌ సీన్స్‌లో అద్బుతంగా నటించి మెప్పించింది.

 Payal Rajput Rx100 Movie Offers-TeluguStop.com

ఆ సినిమా వల్ల ఆమెకు వచ్చిన కొండంత పేరును ఆ తర్వాత చేసిన సినిమాలతో పోగొట్టుకుంది.మరీ చిల్లర పాత్రలు చేయడంతో పాటు ఐటెం సాంగ్స్‌కు కూడా ఓకే చెప్పడంతో ఈమె కెరీర్‌ నాశనం అయ్యిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాలు చేస్తుంది.అయితే అవి కూడా ఈమె కెరీర్‌కు బూస్ట్‌ ఇస్తాయనే నమ్మకం ఎవరికి లేదు.ఎందుకంటే అవి చిన్న సినిమాు అది కూడా కీలక పాత్రల్లో నటించేవే.హీరోయిన్‌గా ఈమె చేస్తున్న సినిమాలు సక్సెస్‌ అవ్వక పోవడంతో ఈమెకు ఆఫర్లే ఇవ్వడం లేదు.

ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ మునుపటి క్రేజ్‌ను దక్కించుకుని ఈసారి జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకోవాలనుకుంటున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌ చాలా కలలు కంటోంది.

 Payal Rajput Rx100 Movie Offers-పాయల్‌ కెరీర్‌లో మళ్లీ ఆ అద్బుతం జరిగేనా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అద్బుతాలు మళ్లీ మళ్లీ జరగవని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే అద్బుతం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి.కాని పాయల్‌ రాజ్‌ పూత్‌ తన కెరీర్‌లో అద్బుతం జరిగిన సమయంలో లైట్‌ తీసుకుని ఇప్పుడు అయ్యో అనుకుంటూ బాధపడుతుంది.

ఈ అమ్మడిని చూసి ఆమె సన్నిహితులు జాలి పడుతున్నారు.పాయల్‌ కెరీర్‌లో మళ్లీ సక్సెస్‌ అనే ఆ అద్బుతం జరిగేనా చూడాలి.

#Payal Rajput #Rx #Item #Offers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు