నేనేం తప్పు చేయలేదంటున్న పాయల్‌ రాజ్‌పూత్‌

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో పాయల్‌ రాజ్‌ పూత్‌ టాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.ఆ సినిమాలో అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది.

 Payal Rajuput Didn't Made Mistake, Payal Rajput Movies, Venky Mama, Rx 100, Item-TeluguStop.com

మొదటి సినిమాలోనే కన్నింగ్‌ లేడీ పాత్రలో నటించిన పాయల్‌ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.ఆ సినిమా తర్వాత ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయి.

అయితే సినిమాల ఎంపిక విషయంలో తప్పు చేయడంతో ఈమె కెరీర్‌ చాలా తక్కువ సమయంలోనే కష్టాల్లో పడ్డట్లయ్యింది అనేది విశ్లేషకుల మాట.
వెంకీ మామ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా కాస్త వయసు ఎక్కువ ఉన్న అమ్మాయి పాత్రలో నటించడం, సీత సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడం వంటి కారణాలతో ఈమెకు ప్రస్తుతం ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు.ఆ రెండు సినిమాలు చేసి పాయల్‌ తప్పు చేసింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ రెండు సినిమాల్లో నటించకుండా ఉంటే పాయల్‌ కెరీర్‌ మరో రకంగా ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.

Telugu Rx, Item, Payal Rajput, Payal Rajuput, Venky Mama-

పాయల్‌ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.ఆ రెండు సినిమాలు చేయడం తప్పుగా నేను భావించడం లేదు.నన్ను నేను కొత్తగా చూసుకునేందుకు ప్రయత్నించాను.అంతే తప్ప ఆ సినిమాలు తప్పు ఎలా అవుతాయి అంటోంది.నా అభిమానులు కాస్త వయసు ఎక్కువ ఉన్న పాత్రలో నన్ను చూడలేక పోయారు.అందుకే ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటుంది.

ప్రస్తుతం ఆహా కోసం ఒక వెబ్‌ సిరీస్‌ లో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన ఈ అమ్మడు కెరీర్‌పై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube