మహాసముద్రంలో దూకడం లేదని తేల్చిన పాయల్ పాప  

Payal Rajput Not In Maha Samudram, Payal Rajput, Maha Samudram, Sharwanand, Tollywood News - Telugu Maha Samudram, Payal Rajput, Sharwanand, Tollywood News

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది.అయితే అమ్మడికి ఆర్ఎక్స్ 100 తరహా గుర్తింపు, విజయం మాత్రం రావడం లేదు.

TeluguStop.com - Payal Rajput Not In Maha Samudram

దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి గతకొంత కాలంగా మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్‌తో పాటు బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ నటిస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తూ వచ్చింది.

TeluguStop.com - మహాసముద్రంలో దూకడం లేదని తేల్చిన పాయల్ పాప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని పాయల్ రాజ్‌పుత్ తెలిపింది.ఆమెను మహాసముద్రం సినిమాలో నటించాల్సిందిగా ఎవరూ తనను సంప్రదించలేదని ఆమె చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.దీంతో ‘మహాసముద్రం’లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ సినిమాను దర్శకుడు అజయ్ భూపతి పూర్తి రొమాంటిక్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

చాలా రోజులుగా ఈ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నా, ఇంకా సినిమా పూర్తి కాకపోవడంతో, ఈ సినిమాను ఎలాగైనా ఈయేడు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి మహాసముద్రం చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో చూడాలి.

అటు పాయల్ రాజ్‌పుత్ కూడా వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే లేడీ పైలట్ పాత్రలో నటిస్తున్న పాయల్, మున్ముందు మరిన్ని విభిన్నమైన పాత్రలు చేసేందుకు ఆసక్తిగా చూస్తోంది.

#Sharwanand #Maha Samudram #Payal Rajput

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు