ముసలాయనతో పాయల్ పాప చిందులు!  

Payal Rajput Item In Indian 2 - Telugu Indian 2, Kamal Hassan, Payal Rajput, Shankar

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఇండియన్-2 అప్పుడెప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకుంది.కానీ ఈ సినిమాకు ఏదో ఓ రకంగా అవాంతరాలు ఎదురవుతూ వస్తున్నాయి.

 Payal Rajput Item Song In Indian 2

ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే.దాని నుండి కోలుకునేలోపే లాక్‌డౌన్ రూపంలో ఈ సినిమాకు మరో అడ్డంకి వచ్చి పడింది.

అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ చేయబోయే పాత్ర భారతీయుడు సినిమాను మనకు గుర్తుకు తెస్తుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కానీ ఈ సినిమాలో ఆయన పాత్ర అంతకు మించి ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ముసలాయనతో పాయల్ పాప చిందులు-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌లో చిందులేసేందుకు చిత్ర యూనిట్ ఆర్ఎక్స్ 100 పాప పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఆర్ఎక్స్ చిత్రంలో తన హాట్ అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ, ఆ తరువాత అంతటి స్థాయి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

కానీ ఇప్పుడు ఇండియన్-2 చిత్రంలో ఐటెం సాంగ్‌లో చిందులేస్తే మాత్రం అమ్మడికి ఇది ఖచ్చితంగా బంపర్ ఆఫర్ అని చెప్పాలి.ఈ ఒక్క సినిమాతో అమ్మడికి సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చి పడుతుంది.

మరి ఈ సినిమాలో ఐటెం వేషాలు వేయడానికి పాయల్ పాప ఏమంటుంది? ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం అమ్మడి దశ తిరిగినట్లే అనుకోవాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Payal Rajput Item Song In Indian 2 Related Telugu News,Photos/Pics,Images..