ఆ హీరో అంటే పడిచస్తున్న ఆర్ఎక్స్ బ్యూటీ

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ తన అందాలతో పాటు నటనతోనూ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది.ఈ బ్యూటీ ఆ తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు చేస్తోంది.

 Payal Rajput In Awe Of Raviteja-TeluguStop.com

ఇటీవల వెంకీ మామ సినిమాలో నటించిన ఈ బ్యూటీ తన నటనతోనూ ప్రేక్షకులను అలరించింది.

తాజాగా మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తుంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రవితేజతో కలిసి నటించినప్పుడు ఆయనను చూసిన నిజంగా షాక్ అయ్యానంటోంది పాయల్.

తాను ఇప్పటివరకు నటించిన హీరోల్లో రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరోను చూడలేదంటోంది.

సెట్స్‌పై రవితేజ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ఆయనతో నటించే వారికి మాత్రమే తెలుస్తుందని ఆమె అంటోంది.

మొత్తానికి ఎక్కడి పాట అక్కడ పాడటం అమ్మడికి బాగానే అలవాటయ్యింది.ఏ హీరోతో నటించినా వారిని పొగడ్తలతో ముంచెత్తుతూ వారిని ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

మరి డిస్కో రాజా చిత్రంలో అమ్మడి పాత్ర ఎలా ఉండబోతుందో సినిమా చూశాక తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube