డీగ్లామర్ లుక్ లో దర్శనమిచ్చిన పాయల్.. అవాక్కైన నెటిజన్లు..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు పాయల్ రాజ్ పుత్.ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో పాయల్ అద్భుతంగా నటించి మెప్పించారు.

 Payal Rajput Glamorous Look Photo Goes  Viral In Social Media, Payal Rajput, De-TeluguStop.com

అయితే ఆర్ఎక్స్ 100 లాంటి హిట్ ఉన్నా ఆ తరువాత పాయల్ నటించిన ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కోరాజా సినిమాల్లో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

పాయల్ నటించిన సినిమాలు హిట్ కాకపోవడం, స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవడం పాయల్ కెరీర్ కు మైనస్ గా మారింది.

అయితే చేతిలో పెద్దగా సినిమా ఆఫర్లు లేకపోయినా సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ యాక్టివ్ గా ఉన్నారు.పోటో షూట్ లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే ఎప్పుడూ గ్లామరస్ గా కనిపించే పాయల్ తాజాగా డీ గ్లామర్ లుక్ లో ఒక ఫోటోను షేర్ చేశారు.

Telugu Bollywood, De, Fear, Offers, Netizens, Payal Rajput, Tollywood-Movie

సీరియస్ లుక్ లో నెటిజన్లను భయపెట్టే విధంగా ఉన్న్ పాయల్ లుక్ నెటిజన్లను భయపెడుతోంది.కొందరు నెటిజన్లు పాయల్ డీ గ్లామర్ లుక్ గురించి కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం పాయల్ ఫోటోలతో భయపెడుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు ఈ ఏడాదైనా పాయల్ మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

సోషల్ మీడియానే నమ్ముకున్న పాయల్ కు ఏ డైరెక్టర్ హీరోయిన్ ఆఫర్ ఇస్తారో చూడాలి.

హిందీ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ సినిమా హిట్టైతే మాత్రమే పాయల్ కోలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి.సీనియర్ స్టార్ హీరోయిన్లకు కూడా అవకాశాలు వస్తుంటే అందం, అభినయం పుష్కలంగా ఉన్న పాయల్ కు పెద్దగా ఆఫర్లు రాకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube