పెద్ద సినిమాలు చిన్న పాత్రలు... ఫీల్ అవుతున్న పాయల్  

Payal Rajput Feel Bad On His Role In Latest Movies-payal Rajput Feel Bad,role In Latest Movies,tollywood,venky Mama

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అటు గ్లామర్ తో, ఇటు పెర్ఫార్మెన్స్ తో అందరిని కట్టిపడేసిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అని అందరూ భావించారు.

Payal Rajput Feel Bad On His Role In Latest Movies-Payal Role Movies Tollywood Venky Mama

అయితే ఊహించని విధంగా మొదటి సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ భామ గత ఏడాది ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఆ సినిమాలో నటిగా ప్రూవ్ చేసుకున్న దర్శకుడు మాత్రం పాయల్ గ్లామర్ తోనే సినిమా నడిపించాలని భావించాడు.

దీంతో సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయితే ఊహించని విధంగా సురేష్ ప్రొడక్షన్ లో బాబి దర్శకత్వంలో వెంకీ మామ సినిమాలో వెంకటేష్ కి జోడీగా నటించే అవకాశం రావడంతో పాయల్ ఎగిరి గంతేసింది.

ఇక బోల్డ్ కంటెంట్ సినిమాలు చేయనని తేల్చేసింది.వెంకి మామ సినిమా మీద ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది.

అయితే సినిమా రిలీజ్ తర్వాత వెంకీమామ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.అయితే ఇందులో పాయల్ పాత్ర మాత్రం తేలిపోయింది.అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు.కేవలం కొన్ని సన్నివేశాలకి మాత్రమే పరిమితం చేశారనే టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే తాజాగా డిస్కో రాజా సినిమాలో మాస్ రాజా రవితేజకి జోడీగా నటించింది.ఈ సినిమా కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.ఇందులో కూడా పాయల్ పాత్ర చాలా తక్కువ నిడివి ఉంటుందని తెలుస్తుంది.ఈ పాత్ర కూడా తనకి పెద్దగా గుర్తింపు తీసుకొచ్చే విధంగా లేదని తెలుస్తుంది.

దీంతో పంజాబ్ లో స్టార్ హీరోయిన్ ముద్ర వేసుకొని తెలుగులో మొదటి సినిమాతో టాలెంట్ చూపించిన తనలోని నటిని తెలుగు దర్శకులు ఉపయోగించుకోవడం లేదని పాయల్ పాప తన సన్నిహితుల దగ్గర భాగా ఫీల్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.మరి నెక్స్ట్ సినిమాలు అయిన ఈ అమ్మడికి అనుకున్న స్థాయిలో గుర్తింపు తీసుకోస్తాయో లేదో అనేది చూడాల్సిందే.

.

తాజా వార్తలు